»   » ఆయన తో మళ్ళీ మొదటి రోజు గుర్తొచ్చింది : కాజల్

ఆయన తో మళ్ళీ మొదటి రోజు గుర్తొచ్చింది : కాజల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

"లక్ష్మీ కళ్యాణం" సినిమాతో కాజల్ ను టాలీవుడ్ కు పరిచయం చేశాడు దర్శకుడు తేజ. ఆ తరువాత ఆమె వరుస ఆఫర్లతో బిజీ అయిపోయి టాప్ హీరోయిన్ లలో ఒకరిగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మధ్యలో వారిద్దరి కాంబినేషన్లో మరే సినిమా రాలేదు.

అయితే దాదాపుగా 9 సంవత్సరాల తరువాత మళ్లీ తేజ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనుంది కాజల్. రానా కథానాయకుడిగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ లో 9న పాల్గొంది ఈ చందమామ భామ.

Life has been a full circle for actress Kajal Agarwal

'ఈ రోజు నా జీవితంలో ఓ ప్రత్యేకమైన రోజు. దర్శకుడు తేజ దర్శకత్వంలో మళ్లీ నటించడం చాలా ఆనందంగా ఉంది. తొమ్మిదేండ్ల క్రితం ఎలా ఫీలయ్యానో..ఈ రోజు కూడా అలాగే ఫీలయ్యాను. ఒక్కమాటలో చెప్పాలంటే నా జీవితంలో ఒక ఫుల్‌ సర్కిల్‌ పూర్తయినట్లు భావిస్తున్నా" అంటూ కాజల్‌ ట్వీట్‌ పెట్టి అభిమానులతో షేర్‌ చేసుకుంది.

తేజ దర్శకత్వంలో తెరకెక్కిన 'లక్ష్మీకళ్యాణం' చిత్రంతో కాజల్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం విదితమే. కాజల్‌ ప్రస్తుతం ఈచిత్రంతోపాటు తెలుగులో మహేష్‌బాబుతో 'బ్రహ్మోత్సవం', తమిళంలో 'గరుడా', 'కవాలై వేండమ్‌', హిందీలో 'దో లఫ్జోమ్‌కీ కహానీ' చిత్రాల్లో నటిస్తోంది.

English summary
Kajal Aggarwal, who started off in Telugu films with director Teja's Lakshmi Kalyanam, is yet again teaming up with the director for his next film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu