twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమరసింహారెడ్డి నిర్మాతకు జీవితఖైదు.. గతంలో ట్యాంక్‌బండ్‌లో దూకి.. రాజమౌళి తండ్రితో...

    సినీ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు అనకాపల్లి సెషన్స్ కోర్టు బుధవారం జీవితఖైదు విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.

    By Rajababu
    |

    సినీ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు అనకాపల్లి సెషన్స్ కోర్టు బుధవారం జీవితఖైదు విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో మరో 16 మందికి జైలుశిక్ష విధించింది. పదేళ్ల క్రితం తూర్పుగోదావరి జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మ పేటలో బీఎంసీ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో మత్సకారుడు గోసల కొండ మృతి చెందారు. అయితే... మత్స్యకారుడి మృతికి నాటి ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు, ఆయన అనుచరులే కారణమంటూ కోర్టులో కేసు దాఖలైంది. ఆ కేసుకు సంబంధించిన తీర్పు బుధవారం వెలువడింది. గతంలో అప్పులబారిన పడి ఆత్మాహత్యాయత్నం కూడా చేశారు.

    నిర్మాతగా..

    నిర్మాతగా..

    జీవిత ఖైదు పడిన చెంగల వెంకట్రావుకు సినీ పరిశ్రమతో మంచి అనుబంధం ఉంది. గతంలో బాలకృష్ణతో సమరసింహారెడ్డి చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో చెంగలకు సినీ పరిశ్రమలో నిర్మాతగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో నరసింహుడు అనే చిత్రాన్ని నిర్మించి అప్పుల బారిన పడ్డాడు.

    ట్యాంక్ బండ్‌లో దూకి ఆత్మాహత్యాయత్నం..

    ట్యాంక్ బండ్‌లో దూకి ఆత్మాహత్యాయత్నం..

    నరసింహుడు చిత్రంతో అప్పుల బారిన పడిన చెంగల వెంకట్రావు గతంలో హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించడం అప్పట్లో సంచలనం రేపింది. ట్యాంక్ బండ్ మీద నుంచి దూకిన చెంగలను పోలీసులు రక్షించి కిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. నరసింహుడు సినిమాకు ముందు ఉత్తరాంధ్రలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్‌ను ప్రారంభించాడు. పంపిణీదారుల నుంచి రూ.కోటికిపైగా అడ్వాన్సులు తీసుకొన్నట్టు ఆరోపణలు వచ్చాయి.

    నరసింహుడు చిత్రంతో అప్పుల్లో..

    నరసింహుడు చిత్రంతో అప్పుల్లో..

    నరసింహుడు బడ్జెట్ భారీగా పెరిగిపోవడంతో విడుదలకు అనేక అవాంతరాలు ఏర్పాడ్డాయి. ఈ సినిమాను రిలీజ్ చేయకుండా అడ్డుకొంటామని పంపిణీదారులు హెచ్చరించడంతో రూ.55 లక్షలు వెనుకకు తిరిగి ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఇంకా రూ.75 లక్షలు బాకీపడినట్టు పంపిణీదారులు వెల్లడించారు. అలాంటి అప్పులను తీర్చలేక ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు పలువురు పేర్కొన్నారు.

    రాజమౌళి తండ్రితో వివాదం

    రాజమౌళి తండ్రితో వివాదం

    ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి, సినీ దర్శకుడు విజయేంద్ర ప్రసాద్‌తోనూ చెంగల వెంకట్రావు గతంలో గొడవలు జరిగాయి. చెంగల వెంకట్రావు తన వద్దకు ఓ కథ కోసం వచ్చారు. తనకు డబ్బులివ్వకుండా రూ.30 లక్షల రూపాయలకు రశీదు తీసుకున్నారు. ఆ తర్వాత వేధించడం ప్రారంభించారు. చెంగల వెంకట్రావు తనను కిడ్నాప్ చేసి, సీసీఎస్ కార్యాలయంలో నిర్బంధించి నన్ను కొట్టారు. 60 లక్షల రూపాయల చెక్కు రాయించుకున్నారు అని మానవ హక్కుల కమిషన్‌కు విజయేంద్ర ప్రసాద్ ఫిర్యాదు చేశారు. దాంతో ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని కమిషన్ హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది.

    చెక్ బౌన్స్ కేసు కొట్టివేత

    చెక్ బౌన్స్ కేసు కొట్టివేత

    ఆ తర్వాత విజయేంద్ర ప్రసాద్‌పై చెంగల వెంకట్రావు చెక్ బౌన్స్ కేసును వేశారు. నాలుగేళ్ళపాటు వాదోపవాదాలు సాగాయి. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఆ చెక్ బౌన్స్ కేసును కోర్టు కొట్టి వేసింది. విజయేంద్ర ప్రసాద్‌కు అనుకూలంగా ఏజెఎఫ్సిఎం కోర్టు న్యాయమూర్తి తీర్పు నిచ్చారు.

    English summary
    Chengala Venkata Rao, producer of the blockbuster movie Samarasimha Reddy starring Bala krishna, gets Life imprisonment in murder case. Long back NTR's Narasimhudu movie producer has attempted suicide by jumping into the hussain sagar river while travelling by the tank bund road. The police who were around at the time rescued him and moved him to KIMS hospital.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X