రాత్రయితే టెన్షన్..బిందు మాధవి

By Staff

Bindu Madhavi
కెరీర్ ప్రారంభం కాకముందు ఇప్పుడు నాకు రాత్రయితే టెన్షన్ గానే ఉంటుంది అంటోంది ఆవకాయ బిర్యాని అమ్మాయి బిందుమాధవి. అనుకున్నది సాధించలేకపోతున్నాను అనే అనిశ్చతే నిద్రపట్టనివ్వటం లేదని చెప్తోంది. తెలుగు చిత్రపరిశ్రమలో చాలా ఎత్తుకు ఎదగాలని,నా కంటూ ఓ ప్రత్యేక స్ధానం ఏర్పాటు చేసుకోవాలన్నదే నా కల. అదే నా ఆశయం..ఆశ..దాని కోసమే నిరంతరం నా ప్రయత్నం అంటూ వివరిస్తోంది. నా ఆటోగ్రాఫ్ తమిళ వెర్షన్ దర్శకుడు చేరన్ డైరక్షన్ లో రెండో సినిమా చేస్తున్నానని, అది ఆటోగ్రాఫ్-2 అని చెప్పి మురిసిపోతోంది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమ గురించి చెపుతూ ఇక్కడ బాలీవుడ్ అమ్మాయిలంటే క్రేజ్..అబ్సెషన్. ఇక్కడ సమస్య ఏమిటంటే ఏ పాత్రలో మొదట కనిపిస్తామో అంతా అలాంటి ఆఫర్స్ తెస్తారు.

నాకు ఆవకాయ బిర్యాని తర్వాత విలేజ్ అమ్మాయి పాత్రలే వస్తున్నాయి. దాంతో ఏది నేను ఏక్సెప్ట్ చేయలేదు. అలాగే బిందు తో వేగటం కష్టం, ఆమె చాలా ఛాయిస్ గా ఉంటుంది, రెమ్యునేషన్ నిక్కచ్చిగా ఉంటుంది..కోటి రూపాయలు డిమాండ్ చేస్తుంది అంటూ రూమర్స్ వచ్చాయి. అవేమీ నమ్మద్దు అంటోంది. ఇక తనకు టాలీవుడ్ లో గాడ్ ఫాధర్స్ ఎవరూ లేరని చెప్పుకొచ్చింది. దాంతో ఇక్కడ నెగ్గుకురావటం కష్టమవుతోందని చెప్తోంది. అలాగే స్క్రిప్టు ఎలాంటిది తీసుకోవలో జడ్జిమెంట్ చెప్పలేను కాబట్టి పెద్ద సంస్ధ,దర్శకుడు వంటివి పరిగణలోకి తీసుకోవాల్సి వస్తోందని చెప్తోంది. తనకు రెగ్యులర్ హీరోయిన్ పాత్రలు ఇష్టం లేదని చెప్తోంది. టాంబ్ రైడర్ లోని లారా క్రాప్ట్ వంటి పాత్రలు వస్తే బాగుంటుందని చెప్తోంది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా సినిమా నటి అయ్యాకే అంతకు ముందు కన్నా ఇబ్బందిగా ఉంటోందని చెప్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X