‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ వాహనం ఆపు...గిఫ్ట్ పట్టు!
హైదరాబాద్: లీడర్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుంటున్న శేఖర్ కమ్ముల సెప్టెంబర్ 14న 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నసంగతి తెలిసిందే. అమిగోస్ క్రియేషన్స్ బేనర్‍పై చంద్రశేఖర్ కమ్ముల, శేఖర్ కమ్ముల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా పబ్లిసిటీ కాంపెయిన్‌ను శేఖర్ కమ్ముల అండ్ టీం బుధవారం ప్రసాద్ లాబ్స్‌లో ప్రారంభించారు. హ్యాపీ ఎక్స్ ప్రెస్, ఫ్యామిలీ ఎక్స్ ప్రెస్, ఫ్రెండ్‌షిప్ ఎక్స్ ప్రెస్ మరియు లవ్ ఎక్స్‌ప్రెస్ అనే పేర్లతో నాలుగు వాహనాలను ప్రచారం నిమిత్తం కేటాయించారు.
దీని గురించి శేఖర్ కమ్ములా మాట్లాడుతూ...సినిమా రిలీజ్ టైమ్‌కి అందరికీ పండుగలా ఉండాలని పబ్లిసిటీ కొత్త తరహాలో ఆకర్షణీయంగా చేస్తున్నాము. ఈ రోజు విడుదల చేసిన ఈ నాలుగు వాహనాల్ని రోడ్డు మీద ఎవరు ఆపిన కొన్ని గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రేక్షకులు ఈచిత్రం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మధ్య తరగతి స్టూడెంట్‌ని, ఫ్యామిలీ ఆడియన్స్‌ని అలరించే కుటుంబ కథా చిత్రమిది.
ఈ చిత్రంలో కొత్త నటీనటులైన అభిజిత్, సుధాకర్, కౌశిక్, షగుణ్, జార, రస్మి, కావ్య, నవీన్, విజయ్, సంజీవ్, శ్రీరామ్‌లను స్టార్ కాంటెస్ట్ ద్వారా ఎంపిక చేశారు. ఈ చిత్రం ద్వారా అక్కినేని అమల సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండగా, హీరోయిన్ శ్రియ సెక్సీ లుక్‌తో ఇందులో కనిపించనుంది. అదే విధంగా చాలా కాలంగా తెరమరుగైన హీరోయిన్ అంజలా జవేరి ఈచిత్రంలో గెస్ట్ పాత్రలో నటించనుంది.
ఈ చిత్రానికి సంగీతం: మిక్కీజె మేయర్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, కెమెరా: విజయ్ సి.కుమార్, ఆర్ట్: తోట తరణి, నిర్మాతలు: శేఖర్ కమ్ముల, చంద్రశేఖర్ కమ్ముల, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శేఖర్ కమ్ముల


Click it and Unblock the Notifications












