‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ హైలెట్స్
హైదరాబాద్: అంచనాలకు తగిన విధంగానే శేఖర్ కమ్ముల సినిమా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా పేరు తెచ్చుకుంది. తొలి రోజు ఈ చిత్రం ఎబో యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఈచిత్రంలో తోట తరణి వేసిన కాలనీ సెట్లు రియల్‌గా ఉండి ఆకట్టుకుంటున్నాయి. ఇక సినిమాలో హైలట్స్ విషయానికొస్తే....
కొత్త నటీనటులైనప్పటికీ శేఖర్ కమ్ముల తనదైన శైలిలో వారిని ప్రెజెంట్ చేసి ప్రేక్షకులకు ఇబ్బంది కలుగకుండా చేసాడు. ఈ చిత్రం ద్వారా మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అమలపై ట్రైన్‌లో చిత్రీకరించిన ఇంట్రడక్షన్ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హీరోయిన్ శ్రియ చాలా అందంగా, మిడిల్ క్లాస్ నైబర్స్‌తో కలిసిపోయే సీన్లలో బాగా నటించింది.
చాలా కాలం తర్వాత హీరోయిన్ అంజలా జవేరీ ఈ చిత్రంలో వానపాటతో ఎంట్రీ ఇచ్చి తన అందచందాలతో ఆకర్షించింది. ఈచిత్రంలో అజలా జవేరీ మాయ పాత్రలో నటించింది. ఆమంటే కాలనీలో కుర్రాళ్లకి మహా మోజు. ఆమె అంత అందంగా కనిపించింది ఈచిత్రంలో, శ్రియ-అభి మధ్య చిన్న పాటి లిప్ లాక్ సీన్ సర్ ప్రైజ్‌లా ఉంటుంది.
ఇక చిత్రంలో డైలాగులు చాలా సింపుల్‌గా, ఎఫెక్టివ్‌గా ఉన్నాయి. కాస్టూమ్స్ కూడా మన తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా ఉన్నాయి. లీడ్ పెయిర్ శ్రీనివాస్, పద్దు మధ్య జరిగే రొమాంటిక్ ట్రాక్ ఇంప్రెసివ్‌గా ఉంది. నాగారాజు తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు బాగా పేలాయి. అతని క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది. సినిమా కాస్త హ్యాపీడేస్ చిత్రాన్ని తలపించినా... పాయింట్ కొత్తగా చూపించాడు శేఖర్ కమ్ముల. సాంకేతిక అంశఆల పరంగా కూడా సినిమా బాగుంది.


Click it and Unblock the Notifications











