నాతో చేయమన్న నాగ్ -పెద్ద స్టార్స్‌తో చేయనన్న కమ్ముల

By Bojja Kumar

హైదరాబాద్: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ' ఆడియో నాగార్జున-అమల చేతుల మీదుగా శుక్రవారం సాయంత్రం(జూలై 27)న జరిగింది. ఈ కార్యక్రమంలో అమల, శ్రియ, రాణా, శఖర్ కమ్ముల, చిత్ర నటీనటులు తదితరులు పాల్గొన్నారు.

ఈసందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఈ చిత్రంలో తన భార్య అమల యంగ్ స్టర్స్‌తో నటించింది. వాళ్లకి అక్కలా ఉంది కానీ అమ్మలా లేదన్నారు. శేఖర్ కమ్ముల ప్రతి ఆడియోకి నన్ను పిలుస్తారు. కానీ నాతో సినిమా మాత్రం తీయడం లేదు. శేఖర్ రెండేళ్లకో సినిమా కాకుండా ఏడాదికో సినిమా తీస్తే ఆడియన్స్ చాలా హ్యాపీగా ఉంటారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా నాగార్జున అమ్మలను ముద్దు పెట్టుకుని అందరి ముఖాల్లో నవ్వులు పూయించారు. అమల మాట్లాడుతూ...20 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లో నటిస్తుండటం ఆనందంగా ఉంది. మల్లీ నన్ను స్ర్కీన్ పై చూపిస్తున్న శేఖర్ కి థాంక్స్ అన్నారు. ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుందన్నారు.

దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ప్రపంచం అంతా చుట్టేసి, ఎన్ని సాధించినా సాయంత్రం కల్లా ఇంటికి చేరడమే మన నైజం. అందులోనే ఉంది ఆనందం అంతా. అలాంటి ఇళ్ల చుట్టూ తిరిగే కథే ఈ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. నేను పెద్ద స్టార్స్‌తో సినిమా తీయను. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా తీయడమే నాకు అలవాటు. అంతకు మించి ఎజెండా ఏమీ లేదు. సినిమా బాగా వచ్చింది అన్నారు.

'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌'చిత్రంలో అభిజిత్‌, సుధాకర్‌, కౌశిక్‌, షగుణ్‌, జారా, రష్మి, కావ్య, నవీన్‌, విజయ్‌ సంజీవ్‌, శ్రీరామ్‌ ప్రధాన పాత్రధారులు. చంద్రశేఖర్‌ కమ్ముల, శేఖర్‌ కమ్ముల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: బండి రత్నకుమార్‌, కళ: తోట తరణి, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, పాటలు: వనమాలి, అనంతశ్రీరామ్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ సి.కుమార్‌, సంగీతం: మిక్కీ జె.మేయర్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X