‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’విడుదల తేదీ ఖరారు
శేఖర్ కమ్ముల తాజా చిత్రం 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'ని సంక్రాంతికి విడుదల చేద్దామనుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం సంక్రాంతికి విడుదల అవుతున్న చిత్రాలతో కలిపి కాకుండా,జనవరి 26న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' తో అందరూ కొత్త వాళ్లతో ఆయన రూపొందించే ఈ చిత్రం షూటింగ్ పూర్తైంది.ఇప్పటివరకూ ఈ చిత్రానికి సంభందించి ఓ స్టిల్ కానీ,టీజర్ కానీ విడుదల చేయకపోయినా మంచి క్రేజ్ ఉంది.
ఈ విషయమై శేఖర్...మాట్లాడుతూ..లీడర్ తరవాత ఎలాంటి కథ చేయాలి? అని ఆలోచించాను. మళ్లీ 'ఆనంద్', 'హ్యాపీడేస్'లాంటి సినిమా కావాలి అనిపించింది. వాటిలో జీవితం గురించి చెప్పాం. ఆ అనుభూతుల్ని మరోసారి చూపిద్దాం అనిపించింది. స్టార్స్ తో సినిమా తీయొచ్చు. కానీ ఈ కథకి కొత్తవాళ్లయితే బావుంటుంది. అందుకే ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిల కోసం అన్వేషిస్తున్నాం. సిక్స్‌ప్యాక్ లూ, ప్రపంచ సుందర్లూ అక్కర్లెద్దు. కథకు సరిపడేలా సహజంగా ఉంటే చాలు అన్నారు.ఇక ఈ చిత్రం కూడా యువతరాన్ని టార్గెట్ తీసారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











