‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ రైట్స్ మాటీవీకే..
ఆనంద్, హ్యాపీడేస్, లీడర్ లాంటి మనసుకు హత్తుకునే సినిమాలను రూపొందించిన శేఖర్ కమ్ముల తాజాగా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈచిత్రాన్ని ఆగస్టులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 27న ఆడియో విడుదల కానుంది.
తాజాగా అందిన సమాచారం ప్రకారం ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ టీవీ ఛానల్ మాటీవీ ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా శేఖర్ కమ్ముల చిత్రాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయం అందుకుంటాయి. ఆ నమ్మకంతోనే మాటీవీ ఆ చిత్రం ఆడియో కూడా విడుదల కాకముందే శాటిలైట్ రైట్స్ దక్కించుకుంది.
శేఖర్ కమ్ముల చిత్రాలంటే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. యువతను ఆకట్టుకునేలా సినిమాలు తీయడంతో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా మెచ్చే విధంగా ఆ సినిమాలను తీర్చి దిద్దడం ఆయన ప్రత్యేకత. ఈ చిత్రానికి మిక్కీజే మేయర్ సంగీతం అందిస్తుండగా, విజయ సి కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇది వరకు తాను దర్శకత్వం వహించిన 'లీడర్' చిత్రం అనుకున్న అంచనాలు చేరుకోక పోవడంతో...ఈ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు శేఖర్ కమ్ముల.
ఈ చిత్రం ఆరుగురు సాధారణ కుటుంబాలకు చెందిన అమ్మాయిలు, అబ్బాల మధ్య నడుస్తుంది. కాస్త హ్యాపీడేస్ పోలికలున్న కథలా ఉంటుంది. అంతా కొత్తవారే నటిస్తున్నారు. అభిజిత్, సుధాకర్, కౌశిక్, షాగున్, జారా, రేష్మి, కావ్య, నవీన్, విజయ్, సంజీవ్, శ్రీరామ్ ఈచిత్రంలో ముఖ్య పాత్ర ధారులు. అమల అక్కినేని, హీరోయిన్ శ్రియ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications












