శేఖర్ కమ్ముల ‘లై.ఈ.బ్యూ’ ఆగస్టు 15న

అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్‌పై స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న శేఖర్ కమ్ముల కొత్త వారిని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా అభిజీత్, సుధాకర్, కౌషిక్, షగుణ్, జారా, రష్మి, కావ్య, నవీన్, విజయ్, సంజయ్, శ్రీరామ్ కొత్త తరాలు పరిచయం కానున్నారు.
సాధారణంగా శేఖర్ కమ్ముల చిత్రాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంటాయి. ఈ చిత్రం కూడా అదే తరహాలో ఉంటుందని అంటున్నారు. తక్కువ బడ్జెట్ తో రూపొందిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఎక్కవ శాతం షూటింగ్ హైదరాబాద్ చుట్టు పక్కల జరుపుకుంది.
ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బండి రత్నకుమార్, కళ: తోట తరణి, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, పాటలు: వనమాలి, అనంతశ్రీరామ్, ఛాయాగ్రహణం: విజయ్ సి.కుమార్, సంగీతం: మిక్కీ జె.మేయర్.


Click it and Unblock the Notifications











