ఈ రోజు నుంచే 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' యాత్ర
అలాగే ''ఇంతటి విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇది మన సినిమా అని నిరూపించారు. రెండోవారం కూడా వసూళ్లు బాగా ఉన్నాయి. యూఎస్‌లో అయితే 50-60 సెంటర్లలో విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం. అందుకే విజయయాత్ర నిర్వహిస్తాం'' అని శేఖర్ కమ్ముల చెప్పారు. ఈ నెల ప్రథమార్ధంలో విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని శేఖర్ ఆనందం వ్యక్తం చేశారు.
అందరూ తనను నాగరాజు అని పిలుస్తున్నారని, సినిమాకు తమ పాత్రలకు అనూహ్యమైన స్పందన వస్తోందని సుధాకర్ చెప్పారు. మోడలింగ్ తప్ప నటన తెలీని తనను శేఖర్ నటునిగా తీర్చిదిద్దారని సంజీవ్ అన్నారు. ఇది శేఖర్ హృదయం నుంచి వచ్చిన కథ అని అభిజిత్ వర్షించారు. ఇంకా ఈ చిత్రంలో నటించిన శ్రీరామ్ కూడా మాట్లాడారు. సోమవారం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలను నేరుగా కలువనున్నారు ఈ చిత్రం యూనిట్ సభ్యులు. అభిజిత్, సుధాకర్, కౌశిక్, షగుణ్, జారా, రష్మి, కావ్య, నవీన్, విజయ్, సంజీవ్, శ్రీరామ్‌లను తెరకు పరిచయం చేస్తూ శేఖర్ కమ్ముల స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'. ఈ సమావేశంలో అభిజిత్, సుధాకర్, సంజీవ్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications












