twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ రోజు నుంచే 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' యాత్ర

    By Srikanya
    |

    హైదరాబాద్ : ''నటీనటులు కొత్తవాళ్త్లెనా సినిమా బాగుంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ విషయం 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌'తో మరోసారి రుజువైంది. మాకు ఇంత పెద్ద విజయం దక్కినందుకు ఆనందంగా ఉంద''న్నారు శేఖర్‌ కమ్ముల. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌'. ఇటీవలే ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శేఖర్‌ మాట్లాడుతూ ''విడుదలైన అన్ని చోట్ల వసూళ్లు బాగున్నాయి. సోమవారం చిత్రబృందం అంతా కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు సందర్శించబోతున్నాము'' అన్నారు.

    అలాగే ''ఇంతటి విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇది మన సినిమా అని నిరూపించారు. రెండోవారం కూడా వసూళ్లు బాగా ఉన్నాయి. యూఎస్‌లో అయితే 50-60 సెంటర్లలో విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం. అందుకే విజయయాత్ర నిర్వహిస్తాం'' అని శేఖర్ కమ్ముల చెప్పారు. ఈ నెల ప్రథమార్ధంలో విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని శేఖర్ ఆనందం వ్యక్తం చేశారు.

    అందరూ తనను నాగరాజు అని పిలుస్తున్నారని, సినిమాకు తమ పాత్రలకు అనూహ్యమైన స్పందన వస్తోందని సుధాకర్ చెప్పారు. మోడలింగ్ తప్ప నటన తెలీని తనను శేఖర్ నటునిగా తీర్చిదిద్దారని సంజీవ్ అన్నారు. ఇది శేఖర్ హృదయం నుంచి వచ్చిన కథ అని అభిజిత్ వర్షించారు. ఇంకా ఈ చిత్రంలో నటించిన శ్రీరామ్ కూడా మాట్లాడారు. సోమవారం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలను నేరుగా కలువనున్నారు ఈ చిత్రం యూనిట్ సభ్యులు. అభిజిత్, సుధాకర్, కౌశిక్, షగుణ్, జారా, రష్మి, కావ్య, నవీన్, విజయ్, సంజీవ్, శ్రీరామ్‌లను తెరకు పరిచయం చేస్తూ శేఖర్ కమ్ముల స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'. ఈ సమావేశంలో అభిజిత్‌, సుధాకర్‌, సంజీవ్‌, శ్రీరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Shekar Kammula happy with his latest Life is Beautiful film. He wants to start Success tour from monday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X