twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ టాక్ ఏంటి?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఆనంద్, హ్యాపీడేస్ లాంటి సూపర్ హిట్ చిత్రాల నేపథ్యంలో భారీ అంచనాల మధ్య విడుదలైన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఎబో యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.

    సినిమా కథ విషయానికొస్తే...పక్కపక్కనే ఉండే రెండు కాలనీల చుట్టూ కథ తిరుగుతుంది. ఒకటేమో ధనవంతుల కాలనీ, మరొకటి మిడిల్ క్లాస్ వాళ్లు ఉండే కాలనీ. శ్రీను (అభిజిత్‌), నాగరాజ్‌ (సుధాకర్‌), అభి (కౌశిక్‌), సత్య (రష్మి), లక్ష్మి (జారా), పద్మావతి (షగుణ్‌)... వీరంతా మిడిల్ క్లాస్ కాలనీ యువతరం. చదువు, లక్ష్యం, ప్రేమ, ఆకర్షణ... ఇలా రకరకాల అనుభవాల్ని ఆస్వాదిస్తూ ఈ యువతరం జీవితాలు ఎంతో అందంగా సాగుతుంటాయి.

    అయితే పక్కనే ఉండే ధనవంతుల కాలనీకి చెందిన వాళ్లతో వీరికి తరచూ చిన్న చిన్న గొడలు జరుగుతూ ఉంటాయి. దీంతో ధన వంతుల కాలనీ వాళ్లు.... బాగా డబ్బుంటే లైఫ్ ఎలా ఉంటుందనేది మిడిల్ క్లాస్ కాలనీ వాళ్లకి రుచి చూపించాలనుకుంటారు. ఈక్రమంలో సన్నివేశాలు ఆసక్తి కరంగా ఉంటాయి.

    ఈ చిత్రంలో శ్రియ ధనవంతుల కాలనీకి చెందిన అమ్మాయిగా నటించింది. మిస్ ఇండియా కాంటెస్టులో పాల్గొన్న శ్రియ మిడిల్ క్లాస్ కాలనీకి చెందిన అభితో ప్రేమలో పడుతుంది. ఇక అంజలా జవేరి....మిడిల్ క్లాస్ కాలనీలో యూత్‌ను అందంతో మత్తెక్కించే పాత్రలో కనిపిస్తుంది. ఆమెను చూడటానికి కుర్రాళ్లు పోటీ పడుతుంటారు. శ్రీను, సత్య తల్లి పాత్రలో అమల నటించింది. అమల క్యాన్సర్ పేషెంట్. పిల్లలకు తన జబ్బు గురించి తెలిస్తే బాధ పడతారని, వారిని హైదరాబాద్‌లో అమ్మమ్మ ఇంటికి పంపి ట్రీట్ మెంట్ చేయించుకుంటుంది.

    ఈ చిత్రం ద్వారా శేఖర్ కమ్ముల ఇచ్చిన మెసేజ్ ఏమిటంటే.....డబ్బున్నంత మాత్రాన లైఫ్ బ్యూటిఫుల్‌గా ఉండదు. బంధాలు, అనుబంధాలు, ఒకరికి ఒకరు అండగా ఉండటం, ఆనందంగా గడిపే క్షణాలు.....ఉన్నప్పుడే జీవితం బ్యూటిఫుల్‌గా ఉంటుంది అని చెప్పదలిచాడు. యూత్‌కి, క్లాస్‌కి నచ్చేవిధంగా సినిమా ఉంది. సినిమాలో కొన్ని సీన్లు బోర్ తెప్పించాయి. కమర్షియల్ అంశాలు లేక పోవడం వల్ల మాస్ ఆడియన్స్‌కు ఈచిత్రం రుచించదనే టాక్ వినిపిస్తోంది.
    '

    English summary
    Sekhar Kammula's Life is Beautiful released today and the movie received above average talk. Life Is Beautiful is set in a colony. It is the coming-of-age story of six youngsters set in the beautiful world of a working class neighbourhood. It traces the journey of the youngsters through different seasons, festivals, romances, street cricket, colony fights and family gatherings.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X