Don't Miss!
- News ఊపిరి పీల్చుకున్న ఉద్యాననగరి..!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
‘లైఫ్ స్టైల్’ చిత్రం రేపే విడుదల
ముప్పలనేని శివ దర్శకత్వంలో కోగంటి రామకృష్ణ, మాధవ్ పట్నాయక్ నిర్మించిన చిత్రం 'లైఫ్ స్టైల్, నిశ్చల్, కార్తీక్, అనన్య, మీనాక్షి దీక్షిత్, తదితరులు నటింస్తున్నారని దర్శకుడు ముప్పలనేని శివ తెలియజేశారు. మంగళవారం రాత్రి సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శివ మాట్లాడుతూ, తాను గతంలో నిర్మించిన తాజ్ మహల్ అమ్మాయికోసం వంటి చిత్రాల తరహాలో ఈ చిత్రముంటుందని చెప్పారు.
నిర్మాత కోగంటి రామకృష్ణ మాట్లాడుతూ, అన్నిటికంటే స్నేహం గొప్పదని తెలియజెప్పేకాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపొందుతోందన్నారు. స్నేహంకోసం త్యాగాలు చేయడం, కొన్ని కష్టాలు అనుభవించడం, ఆపై గోల్ ను సాధించడం వంటివి ఈ చిత్రంలో ఉంటాయని నిర్మాత వెల్లడించారు. యువతకు చక్కని సందేశంకూడా ఇందులో ఇమిడి ఉందని ఆయన తెలిపారు. మొదటి భాగం కాలేజీ నేపథ్యంలోనూ, రెండవ భాగం కుటుంబకథా చిత్రంగా తీర్చిదిద్దినట్లు నిర్మాత అన్నారు. ఇంకా ఈ చిత్రానికి సంగీతం: శ్రీజ.