హత్య కేసు: చిరంజీవి హెయిర్ స్టైలిస్టుకు జీవిత ఖైదు
హైదరాబాద్: చిరంజీవికి హెయిర్ స్టైలిస్టుగా పని చేసిన లిస్బన్ మిరండాకు ముంబై కోర్టు జీవిత ఖైదు విధించింది. అదనపు కట్నం కోసం వేధింపులతో బాటు మద్యం మత్తులో భార్యను హత్య చేసిన కేసులో ఆయనకు ఈ శిక్ష పడింది. లిస్బన్ మిరండా పలువురు సినీ స్టార్లకు హెయిర్ స్టయిలిస్టుగా పని చేసారు.

మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు స్టార్ హీరోల వద్ద ఆయన పని చేసారు. జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగిని బిండియాను 2008లో వివాహమాడిన మిరండా, ఆ సమయంలో 25 లక్షల మొత్తాన్ని (14 లక్షలు ఎఫ్‌డీ రూపంలో) కట్నంగా తీసుకున్నాడు. పెళ్లైన కొంత కాలానికే అదనపు కట్నం కోసం బిండియాను మిరండా వేధించేవాడని అతని స్నేహితులు తెలిపారు.
ఈ క్రమంలో ఓ పార్టీలో చిత్తుగా మద్యం సేవించిన మిరండా భార్యను కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. 19 కత్తిపోట్లకు గురైన బిండియా అక్కడికక్కడే మృతి చెందింది. ఈ కేసుకు సంబంధించి 26 మంది సాక్షులను విచారించిన ప్రత్యేక మహిళా కోర్టు ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.


Click it and Unblock the Notifications