twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పి.సుశీలకు జీవిత సాఫల్య పురస్కారం

    By Srikanya
    |

    P.Suseela
    వాషింగ్టన్‌ : ప్రముఖ గాయని పి.సుశీలకు 'సిలికానాంధ్ర' సంస్థ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయనుంది. అక్టోబరు ఐదో తేదీన కాలిఫోర్నియా రాష్ట్రంలోని కూపర్టినో నగరంలో నిర్వహిస్తున్న ఆంధ్రా సాంస్కృతికోత్సవంలో భాగంగా సుశీలకు జీవిత సాఫల్య పురస్కారం అందజేయనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.

    అనంతరం సుశీల ఆధ్వర్యంలో ''సుగంధాల పాట- సుశీలమ్మ నోట' తెలుగు మధుర గీతాలాపన, కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శనలు, శ్రీకృష్ణ లీలామృతం నాటకం తదితర కార్యక్రమాలు కూడా ఉత్సవాల్లో భాగంగా ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

    ఆంధ్రా కోకిల సుశీల 1935 నవంబర్‌ 13న విజయనగరంలో జన్మించారు.విజయనగరం,మద్రాసు సంగీత కళాశాలలో శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొంది 12ఏటనే తొలి కచేరీ చేశారు. రేడియోలో కచేరీలు, ఆ తర్వాత సినిమారంగంలోకి అడుగుపెట్టడంతో అప్రతిహతంగా ఆమె ప్రస్ధానం కొనసాగింది. నిజంగా ఆమె గానకౌశలం వర్ణనకు అందనిది.

    హుషారు, విషాదం, భక్తీగీతం, యుగళగీతం ఇలా ఒక్కటేమిటీ పాట ఏదైనా ఆమె పాడితే దానికొక సార్ధకత వస్తుంది. అమె గొంతులోని మాధుర్యం మనసుని పరవశింప చేస్తుంది. తన గొంతుతో నవరసాలు పలికించి తెలుగుపాటనే పునీతం చేశారు. ఈ మధ్య అయితే సుశీలమ్మ పాడటం తగ్గించారేమో కానీ 1957 నుంచి మొదలుకుని 90 మధ్యకాలంలో ఆమె పాట వినిపించని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు.ఆమె గానమాధుర్యంతో పులకించని ప్రేక్షకుడూ లేడు.

    తన సుదీర్ఘ చలనచిత్ర జీవితంలో సుశీల ఐదుసార్లు జాతీయ అవార్డులతోపాటు అన్నేసార్లు నంది అవార్డులు అందుకున్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. కేంద్రప్రభుత్వం పద్మభూషణ్‌తో ఆమెను సత్కరించింది. ఇక రాష్ట్రప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డును 2002లో అందుకున్నారు. 60ఏళ్ల సినీ ప్రస్ధానాన్ని అలవోకగా గడిపేసిన ఈ గానకోకిల తన పేరిట ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి , ఏటా తన పుట్టినరోజున సంగీత విద్వాంసులను సన్మానించడం సుశీలమ్మకే చెల్లింది.

    తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషా చిత్రాల్లో వేలాది పాటలు పాడిన సుశీల పద్మభూషణ్‌ అవార్డు అందుకున్నారు. 2001లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య అవార్డు స్వీకరించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ గాయనిగా రెండుసార్లు 1969లో, 1971లో తమిళ చిత్రాల్లో పాడినందుకు స్వీకరించారు. ఆంధ్రాయూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. తమిళనాడు ప్రభుత్వం నుంచి 'కలైమామణి' బిరుదు అందుకున్నారు. ఎన్నో పాటలు పాడిన సుశీలకు చక్రవాకంలోని 'వీణలోనా..' పాట అంటే చాలా ఇష్టం.

    English summary
    Famous play back singer P. Susheela will be honors with Life Time achievement Award by Silicon Andra.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X