twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిత్రహింసలు, ఆడవాళ్ళని చంపేస్తామన్నాడు: నిర్మాత ఆత్మహత్య లేఖలో ధారుణాలు

    |

    గత సంవత్సరం విజయవాడ లో జరిగిన కాల్‌మనీ ఉదంతం గుర్తుందా... కొన్ని వందలమంది జీవితాలని చిన్నాభిన్నం చేసిన ఈ తరహా వడ్డీ వ్యాపారమే చెన్నైలోనూ జరుగుతోంది అక్కడ దాని పేరు "కందు వడ్డీ" ఇదే తరహా అప్పు తీసుకోవటమే తమిళ నిర్మాత అశోక్ ఆత్మహత్యకు కారణం అన్న విషయం బయటకు వచ్చింది. సామాన్య ప్రజల్ని అష్టకష్టాలపాల్జేస్తున్న కందువడ్డీ మాఫియా కోలీవుడ్‌పైనా పంజా విసిరింది. చాలా ఏళ్లుగా చాప కింద నీరులా సినీ పరిశ్రమ మొత్తాన్ని ఇది కబళించేసింది.

    అశోక్‌కుమార్‌ ఆత్మహత్య

    అశోక్‌కుమార్‌ ఆత్మహత్య

    తమిళ సినీ నిర్మాత అశోక్‌కుమార్‌ ఆత్మహత్యతో కోలీవుడ్‌లో కందువడ్డీ దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఈ ఆత్మహత్యకు ఫైనాన్షియర్‌ అన్బు చెళియనే కారణమని పోలీసులకు ఫిర్యాదు అందడంతో, అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు.

    Recommended Video

    ఆ మాటలకి ఏడుస్తూనే ఉన్నా.. వారం నిద్రలేదు..!
    సుబ్రమణ్యపురం

    సుబ్రమణ్యపురం

    నటుడు, దర్శకుడు శశికుమార్‌ బంధువైన అశోక్‌కుమార్‌ కంపెనీ ప్రొడక్షన్‌ సినీ నిర్మాణ సంస్థకు ఇన్‌ఛార్జిగా పనిచేశారు. గతంలో "సుబ్రమణ్యపురం" అనే చిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఫైనాన్షియర్‌ జీఎన్‌ అన్బుచెళియన్‌ వద్ద అశోక్‌కుమార్‌, శశికుమార్‌లు కలిసి కందువడ్డీకి రుణం తీసుకున్నారు.

    ఉరివేసుకుని ఆత్మహత్య

    ఉరివేసుకుని ఆత్మహత్య

    ఏడేళ్లుగా వడ్డీ చెల్లించడంతోనే సరిపోయింది. దీన్ని సాకుగా తీసుకుని వారిని ఫైనాన్స్‌ సంస్థ వేధించడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే గత మంగళవారం అశోక్‌కుమార్‌ తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

     చిత్రహింసలకు గురిచేశాడు

    చిత్రహింసలకు గురిచేశాడు

    అతను రాసిన సూసైడ్‌ నోట్‌లో... "ఫైనాన్షియర్‌ అన్బు చెళియన్‌ చిత్రహింసలకు గురిచేశాడని, తను దైవంలా భావించే శశికుమార్‌ను వేధించడాన్ని చూసి సహించలేకపోయానని, చివరకు తన ఇంటి మహిళలను చంపేస్తానంటూ బెదరించాడని" రాసిపెట్టాడు. దీంతో ఒక్కసారి కందువడ్డీ పాపం బద్దలయ్యింది.

    పోలీసులకు శశికుమార్‌ ఫిర్యాదు

    పోలీసులకు శశికుమార్‌ ఫిర్యాదు

    దీంతో అశోక్‌కుమార్‌ ఆత్మహత్యకు ఫైనాన్షియర్‌ అన్బుచెళియన్‌ కారణమంటూ శశికుమార్‌ వలసరవాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసి సినీ దర్శకులు కరుపళనియప్పన్‌, అమీర్‌, చేరన్‌, నటుడు విమల్‌ తదితర సినీ ప్రముఖులు వలసరవాక్కం పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫైనాన్షియర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేశారు.

     లింగుస్వామి కూడా బాదితుడే

    లింగుస్వామి కూడా బాదితుడే

    ఓ నిర్మాతకి రూ.20 లక్షలు ఇచ్చి రూ.1కోటి వసూలు చేశాడని, ‘ఉత్తమవిలన్‌' నష్టాలతో సతమతమైన లింగుస్వామి ‘రజనీమురుగన్‌' లాభాలన్నీ అన్బు చెళియనే దక్కించుకున్నాడని తాజాగా వెలుగులోకి వచ్చింది. పలువురు అగ్రతారలు మినహా చిన్న హీరోలతో సినిమాలు తీసిన నిర్మాతలందరూ దాదాపుగా అన్బు చెళియన్‌ బాధితులేనని తెలుస్తోంది.

     హీరో అజిత్ కూడా ఇతని భాదితుడే

    హీరో అజిత్ కూడా ఇతని భాదితుడే

    ఇతని బాదితుల జాబితాలో బడా నిర్మాతలూ, హీరోలూ ఉన్నారు ఆఖరికి హీరో అజిత్ కూడా ఇతని భాదితుడే, అశోక్ మరణం తర్వాత ఆగ్రహం చెందిన విశాల్ అంబు చెళియన్ పేరుని మొదట ధైర్యంగా బయట పెట్టటంతో మిగతా వారూ ఒక్కొక్కరే అతని ధారుణాలను బయటికి తెస్తున్నారు.

     కుటుంబ సభ్యులపై దాడులు

    కుటుంబ సభ్యులపై దాడులు

    రుణాలు చెల్లించే వరకు వడ్డీలకు వడ్డీలతో వేధిస్తాడని, చెల్లించలేని పక్షంలో వారి స్థిరాస్తులు స్వాధీనం చేసుకోవడం లేదా కుటుంబ సభ్యులపై దాడులకు పాల్పడడం వంటివి చేసేవాడని కూడా చెబుతున్నారు. ఇంత ధారుణం జరుగుతున్నా ఇన్నాళ్ళూ ఎవ్వరూ నోరు మెదపకపోవటం గమనార్హం.

    English summary
    Director Suseenthiran revealed that even superstar Ajith was harassed by Anbu Chezhiyan, who has been accusing of abetting the suicide of producer Ashok Kumar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X