అవకాశం ఉంటే 'మగధీర'లో ఆ మార్పు: రాజమౌళి

By Srikanya

అవకాశం ఉంటే రామ్ చరణ్ తేజతో చేసిన 'మగధీర' చిత్రంలో ఏం మార్పులు చేస్తారు అంటూ ఓ వెబ్ సైట్ వారు రాజమౌళిని ఇంటర్వూ చేస్తూ అడిగారు. దానికాయిన మగధీర చిత్రంలో చాలా మార్పులు చేయాలనే ఉంది. వాటిల్లో ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ లో హీరో క్యారెక్టరైజేషన్ లో మరింత పెయన్ పెట్టాలని ఉంది అన్నారు. ఏ కళాకారుడు కైనా పూర్తి సంతృప్తి అనేది ఉండదు. ఎంత అధ్బుతం అనిపించినా ఏదో ఒక లోపం కనపడుతూనే ఉంటుంది. ఎందుకంటే అతను ఆ కళారూపాన్ని విపరీతంగా ప్రేమించి ఉంటాడు కనుక. అదే రాజమౌళి లో జరుగుతోంది. ఆయన తన చేసే చిత్రాన్ని విపరీతంగా ఇష్టపడి శిల్పం చెక్కినట్లు చెక్కుతారు. అందుకే బయిటవారికీ కనిపించనవి లోపాలు,మార్పులు ఆయనకు తన చిత్రాల్లో స్పురిస్తూంటాయి ఓ క్రియేటర్ గా ..అనేది నిజం. ప్రస్తుతం ఆయన సునీల్ హీరోగా 'మర్యాద రామన్న' అనే చిత్రం రూపొందిస్తున్నారు. అనంతరం ప్రభాస్ తో ఆర్.కె.బ్యానర్ పై ఓ చిత్రం చేసే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X