twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దుబాయ్‌లో ఆ ప్రక్రియ ముగిసింది కానీ..శ్రీదేవి సౌందర్యాన్ని విదేశీ ప్రధాని కూడా!

    |

    Recommended Video

    Sridevi Passes Away : శ్రీదేవి నీటిలో మునిగి? అంతా ఆ 30 నిమిషాల్లోనే.. ?

    దుబాయ్ నుంచి ఆదివారమే తరలి రావాల్సిన శ్రీదేవి పార్థివ దేహం పోస్ట్ మార్టం నేపథ్యంలో ఆలస్యం జరుగుతోంది. శ్రీదేవి భౌతిక ఖాయం నేడు ముంబై కి తీసుకురానున్నారు. అనిల్ అంబాని ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో శ్రీదేవి పార్థివ దేహాన్ని దుబాయ్ నుంచి ముంబై కు తరలించనున్నారు. కానీ దుబాయ్ లో అధికార నిబంధన కార్యకమాలు పూర్తికావడానికి ఆలస్యం జరుగుతోంది. దీనితో శ్రీదేవి మృతదేహం ముంబై కి ఎప్పుడు చేరుకునేది స్పష్టంగా తెలియడం లేదు. కాగా శ్రీదేవి ఖ్యాతి కేవలం ఇండియాకు మాత్రమే పరిమితం కాదని మరో మారు రుజువైంది. అతిలోక సుందరి సౌందర్యానికి విదేశీ ప్రధాని కూడా మంత్రం ముగ్దుడయ్యారంటే నమ్మగలరా !

    పోస్ట్ మార్టం పూర్తి

    పోస్ట్ మార్టం పూర్తి

    దుబాయ్ లో శ్రీదేవి పార్థివ దేహానికి పోస్ట్ మార్టం ప్రక్తియ పూర్తయింది. కానీ పోస్ట్ మార్టం నివేదిక మాత్రం ఇంకా రాలేదు.

    అక్కడే ఆలస్యం జరుగుతోంది

    అక్కడే ఆలస్యం జరుగుతోంది

    విదేశీ నిబంధనల కారణంగా శ్రీదేవి భౌతికకాయాన్ని ఇండియాకు తరలించే ప్రక్రియ ఆలస్యం అవుతోంది. దీనితో శ్రీదేవి పార్థివదేహం ఇండియాకు తెరలించే సమయం, ఆమె అంత్య క్రియల విషయంలో స్పష్టత రావడం లేదు.

    అంత్యక్రియలు ఎప్పుడు

    అంత్యక్రియలు ఎప్పుడు

    శ్రీదేవి అంత్యక్రియలు నేడే జరిగే నేపథ్యంలో ఆమెని కడసారి చూసుకునే అవకాశం ఎక్కువ మంది అభిమానులకు కలగక పోవచ్చు. దీనితో శ్రీదేవి అంత్యక్రియలు రేపటికి వాయిదా వేసే అవకాశాలు లేకపోలేదు. ఏదిఏమైనా ఈ విషయంలో శ్రీదేవి కుటుంబ సభ్యుల నుంచి ప్రకటన రావాల్సి ఉంది.

    శ్రీదేవి ఖ్యాతి ఇండియాలోనే కాదు

    శ్రీదేవి ఖ్యాతి ఇండియాలోనే కాదు


    శ్రీదేవి ఖ్యాతి ఇండియాకు మాత్రమే పరిమితం కాదు. ఆమె సౌందర్యం, నటన విదేశీయులని సైతం మంత్రముగ్దుల్ని చేసింది. పాక్ లోని నటులు శ్రీదేవి మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

    శ్రీదేవి సౌందర్యానికి విదేశీ ప్రధాని ఫిదా

    శ్రీదేవి సౌందర్యానికి విదేశీ ప్రధాని ఫిదా

    శ్రీదేవి సౌందర్యానికి విదేశీ ప్రధాని సైతం మంత్రముగ్దుడయ్యారు. ఇది నిజం. టిబెట్ ప్రధానిగా ఉండి బహిష్కరణకు గురైన లొంబ్ సాంగ సాంగే శ్రీదేవి మృతి పట్ల షాక్ కు గురయ్యారు. ఆయన స్వయంగా శ్రీదేవి మృతికి సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేయడం విశేషం.

    ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో

    ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో

    తాను ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకుంటున్న రోజుల్లో శ్రీదేవి చిత్రాలని విపరీతంగా చూసేవాడనని లొంబ్ సాంగ సాంగే గుర్తు చేసుకున్నారు. శ్రీదేవిని కోల్పోయిన లక్షలాది మంది అభిమానుల్లో తాను కూడా ఒకడినని సాంగే స్పందించడం ఈ అతిలోక సుందరి ఖ్యాతికి నిదర్శనం.

    English summary
    Like millions, we will miss Sridevi too, says Tibetan PM Lobsang Sangay. He is huge fan of Sridevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X