త్రిష దారిలో పూనమ్ కౌర్.. ఆ ప్రదేశంలో టాటూ.. షాకింగ్ పిక్స్ వైరల్
సెలెబ్రిటీలకు ఓ పిచ్చి ఉంటుంది. అదే పచ్చబొట్టు పొడిపించుకోవడం. కొందరు తమకిష్టమైన వారి పేర్లను టాటూలుగా వేయించుకుంటారు. ఇంకొందరు ఇష్టమైన జీవుల బొమ్మలను, పేర్లను వేయించుకుంటారు. అయితే కొందరు చిత్రవిచిత్రమైన ప్రదేశాల్లో టాటూలు వేయించుకుంటారు. వీటిలో త్రిష మొదటి సారిగా అందరినీ షాక్‌కు గురించి చేసింది. తన ఎద భాగంపై నీమో అనే చేప బొమ్మను టాటూగా వేయించుకోవడంతో అందరూ షాక్ అయ్యారు.

టాటూలతో వైరల్..
ఇలా టాటూలతో హీరోయిన్లందరూ రచ్చ రచ్చ చేస్తుంటారు. త్రిష ఎదపై, సమంత మెడపై, చేతులపై, నయన తార మెడపై టాటూలు బాగానే వైరల్ అయ్యాయి. అయిన నయన్ ప్రభుదేవాతో బ్రేకప్ అయ్యాక టాటూను తీయించేసుకుంది. ఇలా టాటూలు అనేవి కొత్తేమీ కాదు. అయితే తాజాగా పూనమ్ కౌర్ తన ఎదపై పొడిపించుకున్న గుర్తులు మాత్రం వివాదామవుతున్నాయి.

వివాదాలతో సావాసం..
పూనమ్ కౌర్ అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, సుశాంత్ సింగ్ కేసు, డ్రగ్స్ కేసు, శ్రీరెడ్డిపై కామెంట్లు ఇలా ప్రతీ ఒక్క అంశంలో పూనమ్ కౌర్ చేసే కామెంట్లు ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఈ మధ్యే తన కలల గురించి చెప్పుకొచ్చింది.

తాజాగా అలా..
తాజాగా పూనమ్ ఓ ట్వీట్ చేసింది. జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా పూనమ్ పోస్ట్ చేస్తూ.. నేను ఓ న్యాయవాదిని అయి ఎంతో పోరాడుదామని అనుకున్నాను కానీ ఏది నెరవేరలేదు.. ఎందుకంటే విధికి తెలుసు ఏం చేయాలో.. అది ఏమనుకుంటే అదే జరుగుతుందని నిరాశగా చెప్పుకొచ్చింది.
Recommended Video

త్రిశూలం, నాగుపాము..
తాజాగా పూనమ్ కౌర్ తన ఎదపై పొడిపించుకున్న టాటూలను చూపించింది. ఎద భాగంలో త్రిశూలం, నాగుపాము బొమ్మలను టాటూగా వేయించుకుంది. ఎదపై త్రిశూలం ఉందంటే.. మనలో శివుడు ఉన్నట్టే అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ టాటూపై కొందరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











