‘లింగా’ ఆడియో రిలీజ్ వాయిదా పడింది
హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీ హీరోగా, అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్ లు గా నటిస్తున్న లింగా చిత్రం టీజర్ విడుదల చేశారు. రాక్ లైన్ఎంటర్టైన్మెంట్ పతాకం పై రాక్ లైన్ వెంకటేష్ అత్యంత ప్రతిష్ఠత్మకంగా నిర్మిస్తున్న లింగా చిత్రానికి కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తుండగా, ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న రజనీ కాంత్ జన్మదిన కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి.
కాగా ఈ చిత్రం ఆడియో ఈ నెల 9న విడుదల చేయాలని తొలుత అనుకున్నారు. అయితే అనుకోని కారణాలతో ఆడియో విడుదల వేడుక నవంబర్ 16కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ సమాచారం వెలువడాల్సి ఉంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఇండియాలోని అతి ఉత్తమమైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ చిత్రం మొదటి లుక్ విడుదలైనప్పటి నుండి రెస్పాన్స్ అదిరిపోతోంది.
ఆ మధ్య ఓసారి సినిమా గురించి నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ మాట్లాడుతూ "మా బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకం గా తెరకెక్కుతున్న చిత్రం లింగా. సూపర్ స్టార్ రజని కాంత్ గారితో చేయటం చాలా హ్యాపీ గా ఉంది, అయన సరసన అనుష్క, సోనాక్షి సిన్హాలు నటిస్తున్నారు. ఎ.ఆర్ రెహమాన్ సంగీతం, రత్నవేలు కెమెరా ఇలా భారత దేశం లో ఉన్నతమైన సంకేతిన నిపుణుల తో ఈ చిత్రం చేస్తున్నాము. సూపర్‌స్టార్ రజనీకాంత్ గారితో వరుస విజయాలు సాధిస్తున్న దర్శకుడు కె.ఎస్.రవి కుమార్ దర్శకత్వం లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. రవికుమార్- రజని కాంత్ గారి కాంబినేషన్‌లో వచ్చిన ముత్తు, అరుణాచలం, నరసింహ చిత్రాలు ఎంత పెద్ద విజయాలు సాధించాయో అందరికి తెలిసిందే ఈ సినిమా ఆ చిత్రాలని మించి ఉంటుంది అన్నారు.


Click it and Unblock the Notifications











