‘లింగా’ దర్శకుడితో ఈగ విలన్ సుదీప్ మూవీ?

By Bojja Kumar

హైదరాబాద్: కన్నడ స్టార్ హీరో సుదీప్ ‘ఈగ' చిత్రం ద్వారా దక్షిణాదిలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సుదీప్ బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ‘లింగా' దర్శకుడు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని కన్నడ సినీ వర్గాల్లో చర్చసాగుతోంది.

వాస్తవానికి ఈ చిత్రం....‘లింగా' చిత్రానికి ముందే ప్రారంభం కావాల్సి ఉంది. లింగాకు ముందే ముందే ఇద్దరూ కలిసి సినిమా చేద్దామనుకున్నారు. అయితే అనుకోకుండా ‘లింగా' ప్రాజెక్టు ఓకే కావడంతో రవికుమార్ ఈచిత్రాన్ని వాయిదా వేసారు. ఇపుడు లింగా పూర్తవడంతో కెఎస్ రవికుమార్ ఈ సినిమాపై దృష్టి సారించాడట.

Lingaa Director KS Ravikumar To Direct Kiccha Sudeep?

త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఈ చిత్రం కన్నడతో పాటు తెలుగు, తమిళంలో కూడా విడుదల చేస్తారట. ‘ఈగ' చిత్రం తర్వాత సుదీప్ ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించడం వల్ల సౌత్ లో తన స్టార్ డమ్ మరింత పెరుగుతుందని సుదీప్ భావిస్తున్నాడు.

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టు మూవీ ‘బాహుబలి'లో కూడా సుదీప్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X