రజనీ ‘లింగా’: ఫస్ట్ డే 50 లక్షలతో రికార్డ్
హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'లింగా'. ఈ చిత్రంలో రజనికి జోడిగా అందాల భామలు అనుష్క, సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కెఎస్. రవి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మాతగా రాక్‌లైన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సౌత్ ఇండియాలో అత్యంత భారీగా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ, ఏ.అర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.
తాజాగా వినాయక చవితి పురస్కరించుకుని విడుదలైన ఈచిత్రం ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కి తొలిరోజు 50 లక్షల హిట్స్ వచ్చాయి. ఆడియోని దీపావళికి రిలీజ్ చేసి సినిమాని రజనికాంత్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ...''మా బ్యానర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం లింగా. సూపర్ స్టార్ రజనికాంత్ గారితో మేము చిత్రం చేయటం చాలా హ్యాపీగా ఉంది, అయన సరసన అనుష్క, సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. రెహమాన్ సంగీతం, రత్నవేలు కెమెరా ఇలా భారత దేశంలో ఉన్నతమైన సంకేతిన నిపుణులతో ఈ చిత్రం చేస్తున్నాము. కెఎస్.రవి కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము, రవికుమార్, రజనికాంత్‌గారి కాంబినేషన్‌లో వచ్చిన ముత్తు, అరుణాచలం ఎంత పెద్ద విజయాలు సాధించాయో అందరికి తెలిసిందే ఈ సినిమా ఆ రెండు చిత్రాలని మించి ఉంటుంది. లింగా చిత్రానికి సంబందించి మొదటి లుక్‌ని ఈ వినాయక చవితి కి రిలీజ్ చేసాము. చూసిన ప్రతి ఒక్కరు తలైవా, సూపర్ స్టార్ రజనికాంత్ గారి లుక్ అదిరిపోయింది అంటున్నారు. అంతే కాకుండా ఒక్కరోజులోనే రికార్డు హిట్స్ ఇచ్చి కొత్త రికార్డు ని సృష్టించారు. ఇంతటి ఆనందాన్ని మాకు, మా టీం కి ఇచ్చిన వారందరికీ మా ధన్యవాదాలు, రెహమాన్ గారు అందించిన సంగీతం దీపావళి కి విడుదల చేసి, సినిమా ని సూపర్ స్టార్ రజని కాంత్ గారి పుట్టిన రోజున విడుదల చేస్తాము" అని అన్నారు.


Click it and Unblock the Notifications











