రజనీ చెప్పాడు...ఫ్యాన్స్ కు పండుగే

By Srikanya

హైదరాబాద్: రజనీకాంత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ సౌత్ ఇండియాలో వేరే హీరోకు లేదంటే అతిశయోక్తి కాదేమో. స్త్టెల్‌, పంచ్‌ డైలాగులు, మాస్‌, కమర్షియల్‌.. రజనీకాంత్‌ చిత్రంలో ప్రతి ప్రేక్షకుడూ ఎదురుచూసే అంశాలివి. అయితే ఇటీవల విడుదలైన ఫొటో రియాలిస్టిక్‌ యానిమేషన్‌ చిత్రం 'కోచ్చడయాన్‌' ఆశించిన స్థాయిలో రజనీ అభిమానులను అలరించలేదు. రజనీ తదుపరి చిత్రం 'లింగా' పై అంచనాలు పెంచుకున్నారు. ఈ సందర్బంగా రజనీకాంత్ స్వయంగా ఈ చిత్రం విడుదల తేది ప్రకటించి తన అభిమానులను ఆనందంలో ముంచెత్తారు.

'లింగా' రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు రజినికాంత్. ఈ సినిమా దీపావళికి విడుదల అవుతుందని వార్తలు వచ్చినా అవి నిజం కాదని చెప్పారు. బెంగుళూరు లో అక్కడ మీడియాతో మాట్లాడిన రజినీకాంత్.. తన పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న 'లింగా' విడుదల అవుతుందని ప్రకటించారు. ఈ చిత్రంలో రజనీ దొంగగా, ఇంజినీరు గా ద్విపాత్రలలో కనపించనున్నారు.

Lingaa’s release date confirmed

దర్శకుడు కేఎస్‌ రవికుమార్ ఇందుకోసం బాణీలను త్వరగా సమకూర్చి ఇవ్వాలని ఏఆర్‌ రెహ్మాన్‌ను అడిగారట. బాలీవుడ్‌, హాలీవుడ్‌ చిత్రాలతో బిజీగా ఉన్న రెహ్మాన్‌.. రజనీ సినిమాపై దృష్టి పెట్టినట్లు సమాచారం.

స్టార్ గా వెలుగుతున్న వారి చిత్రాలకు హిట్,ఫ్లాఫ్ లకు సంభంధం ఉండదని మరోసారి ప్రూవ్ అవుతోంది. రీసెంట్ గా రజనీ విక్రమ్ సింహా వంటి ప్లాఫ్ ఇచ్చినా ఆయన తాజా చిత్రం "లింగా" డబ్బింగ్ రైట్స్ కు మాత్రం ఎక్కడా తగ్గకుండా బిజినెస్ ఎంక్వైరీలు వస్తున్నట్లు సమాచారం. తెలుగులో ఈ చిత్రం రైట్స్ సంపాదించాలని పెద్ద నిర్మాతలు సైతం ట్రేడ్ ఎంక్వైరీలు చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. రజనీ చిత్రం "శివాజి" తరహాలో ఇది ఘన విజయం సాధిస్తుందని అప్పుడే అంచనాలు వేస్తున్నారు. దాంతో దాదాపు 30 కోట్లు వరకూ ఈ రైట్స్ వెళ్లే అవకాసం ఉందని తెలుస్తోంది.

నిర్మాతలు మాట్లాడుతూ... ''రెండు తరాల వారధిగా సినిమా ఉండబోతోంది. రజనీకాంత్‌ నుంచి చాలా రోజుల తర్వాత వస్తున్న పూర్తిస్థాయి యాక్షన్‌ తరహా చిత్రమిది. కె.ఎస్‌.రవికుమార్‌ చక్కటి కథతో ప్రేక్షకులను విస్మయపరచబోతున్నారు. రజనీ వైవిధ్య శైలి, కె.ఎస్‌.రవికుమార్‌ పాళి కలిసి సినిమా కొత్తగా ఉండబోతోంది'' అంటున్నారు.

మరోప్రక్క దక్షిణాదిలో తొలి చిత్రంతోనే బాలీవుడ్‌ నాయిక సోనాక్షి సిన్హాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 'లింగా'లోని నటనకుగాను రజనీ సహా చిత్రబృందమంతా పొగడ్తలతో ఆమెను ముంచెత్తిందట. ''దక్షిణాదికి కొత్త అయినప్పటికీ సోనాక్షి మెరుగైన నటనను ప్రదర్శిస్తోంది. తొలి టేక్‌లోనే సన్నివేశాలను పూర్తి చేసుకుంటోంది'' అంటూ యూనిట్ సోనాక్షిని పొగిడేస్తోంది.

చిత్రంలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్. జగపతిబాబు ముఖ్య పాత్రలో కనిపిస్తారు. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత. ఈ సినిమాలో నయనతార ప్రత్యేక గీతంలో నర్తించనుందని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X