లింగుస్వామి దర్శకత్వంలో అల్లు అర్జున్
ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ను హీరోగా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. లింగు స్వామి గత సినిమాలు ఇక్కడ విజయవంతం అయిన నేపథ్యంలో ఆయన తాజా సినిమా టాలీవుడ్లో చర్చనీయాంశం అయింది. ముఖ్యంగా మెగా అభిమానులు ఈ కాంబినేషన్‌పై చాలా ఆసక్తిగా ఉన్నారు.
లింగు స్వామి గత సినిమాలు చూస్తే....ఎంటర్టెన్మెంట్ విత్ యాక్షన్, రొమాన్స్ బ్యాక్ బ్రాప్‌తో యూత్‌కు నచ్చే విధంగా ఆయన సినిమాల శైలి ఉంటుంది. తాజాగా అల్లు అర్జున్‌తో చేయబోయే సినిమాలో కూడా అదే ఫార్ములాను ఉపయోగించి సరికొత్తగా రూపొందించాలనే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ సినిమా విషయానికొస్తే....ఆయన నటించిన 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం ఇటీవల విడుదలై మిక్స్‌డ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలో ఆయన రామ్ చరణ్ 'ఎవడు' చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు. దీని తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'రేసుగుర్రం' చిత్రం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












