»   » బాలయ్య ‘లయన్’ ఆడియో రిలీజ్ ప్రత్యేకత ఏమిటి?

బాలయ్య ‘లయన్’ ఆడియో రిలీజ్ ప్రత్యేకత ఏమిటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘లయన్'. రుద్రపాటి ప్రేమలత నిర్మాణ సారథ్యంలో జివ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సత్య దేవ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

తొలిసారిగా బాలయ్యతో త్రిష జతకడుతుండగా...‘లెజెండ్' అనంతరం రాధిక ఆప్టే మరోమారు బాలకృష్ణ సరసన నటిస్తోంది. మణిశర్మ సంగీతం సమకూర్చుతున్న ‘లయన్' ఆడియోను ఏప్రిల్ 9న పలువురు సినీ మరియు రాజకీయ ప్రముఖుల సమక్షంలో అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్ర నిర్మాత రుద్రపాటి రమణారావు సన్నాహాలు చేసుకుంటున్నారు.


Lion Audio Launch on April 9th by AP CM

హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరుగనున్న ఈ ఆడియో వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత రమణారావు మాట్లాడుతూ...‘మా నందమూరి నటసింహం బాలకృష్ణ గారు త్వరలో ‘లయన్'గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో బాలయ్య గారి పాత్రను దర్శకుడు సత్యదేవ మలిచిన తీరు, ఆయన చేత పలికించిన సంబాషణలు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి. బాలకృష్ణ-మణిశర్మ కాంబినేషన్ లో వస్తున్న మరో మ్యూజికల్ సెన్నేషన్ హిట్ ఈ సినిమా' అన్నారు.


‘లెజెండ్' వంటి లెజెండరీ హిట్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో నందమూరి అభిమానుల్లో ‘లయన్' చిత్రంపై భారీ అంచనాలుండటం సహజమే. వారి అంచనాలను మించే స్థాయిలో ‘లయన్' చిత్రం ఉండబోతోంది అన్నారు. బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్స్‌గా పేర్కొనే..సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు చిత్రాల ఆడియోలకు నారా చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో విచ్చేసి ఆడియో రిలీజ్ చేసారు. సెంటిమెంట్ పరంగా చూసుకుంటే ‘లయన్' చిత్రం బాలయ్య కెరీర్లో మరో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు అన్నారు నిర్మాత.

English summary
Nandamuri Balakrishna "Lion" Audio Launch on April 9th by AP CM Nara Chandrababu Naidu.
Please Wait while comments are loading...