బాలయ్య ‘లయన్’ పైరసీ సీడీలు, ఇది ఎవరి పని?
హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘లయన్' చిత్రం అలా విడుదలవ్వడం ఆలస్యం...ఇలా పైరసీ సీడీలు మార్కెట్లోకి వచ్చాయి. తాజాగా ఒంగోలులోని సీడీ షాపులపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లయన్ సినిమా పైరసీ సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీడీ షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.
లయన్ పైరసీ వెనక....సౌతిండియా పైరసీ మాఫియా హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో ఈ పైరసీ సీడీలు ఇప్పటికే పంపిణీ అయినట్లు సమాచారం. అదే నిజమైతే పైరసీ కారణంగా నిర్మాతలు నష్టపోవడం ఖాయం.

సినిమా విషయానికొస్తే....‘లయన్' చిత్రం ఓపెనింగ్స్ భారీగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 5.5 కోట్ల మేర వసూలు చేసినట్లు సమాచారం. ఈ చిత్రం ద్వారా సత్య దేవ దర్శకుడిగా పరిచయం అయ్యారు. రుద్రపాటి రామరావు నిర్మాత. బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: వెంకట్ ప్రసాద్, కూర్పు: గౌతంరాజు


Click it and Unblock the Notifications











