»   » తెలుగులో ఇదే ఫస్ట్: హీరో, హీరోయిన్ లిప్‌లాక్ ప్రాక్టీస్ (వీడియో)

తెలుగులో ఇదే ఫస్ట్: హీరో, హీరోయిన్ లిప్‌లాక్ ప్రాక్టీస్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా వాళ్ల పబ్లిసిటీ స్టంట్స్ మామూలుగా ఉండవు. ఇందుకోసం వారు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తుంటారు. తాజాగా 'అర్జున్ రెడ్డి' పేరుతో తెరకెక్కుతున్న చిత్రం విషయంలో సరికొత్త పబ్లిసిటీ ట్రిక్ ప్లే చేసారు. సినిమా షూటింగ్ సమయంలో హీరో హీరోయిన్ లిప్ లాక్ ప్రాక్టీస్ చేసే వీడియో రిలీజ్ చేసారు. ఇలాంటి ముద్దు సీన్లు చిత్రీకరించే సమయంలో దర్శకుడు ఎలాంటి సూచనలు ఇస్తాడు, నటీనటులు ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూడొచ్చు.

'ఎవడే సుబ్రమణ్యం' చిత్రంలో డిఫరెంట్ క్యారెక్టర్ లో మెప్పించిన విజయ్ దేవర కొండ హీరోగా నూతన చిత్రం 'అర్జున్ రెడ్డి'. భ్రదకాళి పిక్చర్స్ బ్యానర్ పై సందీప్ దర్శకత్వంలో ప్రణయ్ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. షాలిని హీరోయిన్ గా నటిస్తుంది.

Liplock Practice for Arjun Reddy Movie

సినిమా ప్రారంభమైన రోజునే సినిమా పస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. డిఫరెంట్ లవ్ అండ్ యాక్షన్ స్టోరీ తో రూపొందనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ మొదటి వారం నుండి ప్రారంభం అయింది. ఈ చిత్రాన్ని హైదరాబాద్, మంగళూర్, డెహ్రడూన్, ఢిల్లీతో పాటు ఇటలీలో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు రధన్ సంగీతాన్ని అందిస్తుండగా, నగేష్ బన్నేల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

విజయ్ దేవర కొండ ఇప్పుడు 'పెళ్లిచూపులు' చిత్రంతో త్వరలోనే ప్రేక్షకులను పలకరించనున్నారు. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా టీజర్ కు ఆడియెన్స్ నుండి చాలా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు అర్జున్ రెడ్డి అనే డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు.

Read more about: liplock arjun reddy sandeep vanga
English summary
Bhadrakali pictures Arjun Reddy at acting workshop video. directed by Sandeep Vanga. produced by Pranay. starring Vijay Devarakonda & Shalini.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu