లిప్ కిస్సులా! అందరితో కుదరదు.. ఆ హీరోతో అయితే దేనికైనా రెడీ.. తమన్నా ఓపెన్ కామెంట్స్
దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమా అవకాశాలు పట్టేస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. తన అందచందాలతో కుర్రకారుకు మత్తెక్కిస్తున్న ఈ లేడీ బ్యాచిలర్.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. వివరాల్లోకి పోతే..

15 ఏళ్ల సినీ కెరీర్.. తమన్నా దూకుడు
తన పదహారేళ్ళ ప్రాయంలోనే సినీ గడప తొక్కింది తమన్నా. మొదట హిందీ సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత దక్షిణాది తెరపై దూకుడు ప్రదర్శించింది. దర్శక నిర్మాతలను క్యూ కట్టించుకుంటూ వరుస హిట్స్ చేజిక్కించుకుంది. దాదాపు అందరు అగ్ర హీరోలతో ఆడిపాడిన ఈ అమ్మడు ఇప్పటికే 15 ఏళ్ల సినీ కెరీర్ కొనసాగించింది.

మహేష్ బాబుతో నైట్ పార్టీ..
ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ''డ్యాంగ్.. డ్యాంగ్'' అంటూ యమ జోష్‌లో కనిపించింది తమన్నా. ఈ పాటలో మహేష్ బాబును నైట్ పార్టీకి పిలుస్తూ తెగ స్టెప్పులేసింది. ఇప్పటివరకు ఆమె చేసిన పాటలన్నింటిలో హుషారెత్తించే పాటగా ఈ ''డ్యాంగ్.. డ్యాంగ్'' సాంగ్ నిలిచింది.

పెళ్లి, ముద్దు సీన్లపై తమన్నా కామెంట్స్
ఇకపోతే తమన్నా ఇటీవలే గోపీచంద్ సరసన సిటీమార్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా తన పెళ్లి, ముద్దు సీన్ల విషయమై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

నా స్వయంవరంలో ఆ ముగ్గురు హీరోలు
మీకే గనుక స్వయంవరం ఏర్పాటు చేస్తే అందులో ఏ హీరోలు ఉండాలని కోరుకుంటారని జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు.. ప్రభాస్, విక్కీ కౌశల్, హృతిక్ రోషన్ తప్పకుండా ఉండాలని కోరుకుంటానని చెప్పింది తమన్నా. అంతేకాదు ఈ ముగ్గురు తన అభిమాన హీరోలని కూడా తెలిపింది.
Recommended Video


ఆ హీరోతో అయితే సిద్దమే..
ఇక హృతిక్ రోషన్‌తో తాను ముద్దు సీన్లలో నటించేందుకైనా సిద్ధమేనని తమన్నా చెప్పడం ఆసక్తికర అంశం. సాధారణంగా తాను సినిమాల్లో కిస్సింగ్ సీన్లకు దూరంగా ఉంటానని, అయితే హృతిక్‌తో చేయాల్సి వస్తే ఆ రూల్స్ పక్కనపెట్టేస్తానని తమన్నా చెప్పుకొచ్చింది. ఇలా తమన్నా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయి వార్తల్లో నిలిచాయి.


Click it and Unblock the Notifications











