దేవుడా మళ్లీ ఇదేంది? సెన్సార్ కోరల్లో లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా.. షారుక్ మండిపాటు
మహిళా ప్రాధాన్యమున్న ఈ చిత్రంలో అశ్లీల పదాలు ఉన్నాయన్న కారణంతో లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారు.
ఇటీవల కాలంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) అనేక వివాదాల్లో కూరుకుపోతున్నది. ఉడ్తా పంజాబ్ విషయంలో సెన్సార్ తీరు అభ్యంతరకరంగా మారింది. అలాగే ఆస్కార్ అవార్డు గెలుచుకొన్న మూన్‌లైట్ చిత్రంలోని పలు సన్నివేశాలపై కట్స్ వేయాలని అధికారులు చెప్పడం మరోసారి వివాదాస్పదమైంది. ఇవన్ని ఒకటైతే తాజాగా లిప్‌స్టిక్ అండర్ మై బుర్కా అనే చిత్రంపై నిషేధం విధించడం మరోసారి సెన్సార్ అధికారుల తీరు వెలుగులోకి వచ్చింది. మహిళా ప్రాధాన్యమున్న ఈ చిత్రంలో అశ్లీల పదాలు ఉన్నాయన్న కారణంతో సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారు.
ముస్లిం మహిళల స్వేచ్ఛపై సినిమా
ముస్లిం మహిళల స్వేచ్ఛ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ప్రకాశ్ ఝా నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో రాణా పాథక్ షా, కొంకణా సేన్ శర్మ, ఆహానా కుమ్రా తదితరులు నటించిన చిత్రానికి అలంకృత శ్రీవాస్తవ దర్శకత్వం వహించారు.

విడుదలకు ముందే విదేశాల్లో అవార్డులు
విడుదలకు ముందే ఈ చిత్రం ముంబై ఫిలిం ఫెస్టివల్‌లో ఆక్స్‌ఫామ్ అవార్డును, టోక్యో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో స్పిరిట్ ఆఫ్ ఏషియా ప్రైజ్ అందుకొన్నది. అలాగే గ్లాస్‌గోవ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విమర్శకుల ప్రశంసలతోపాటు అవార్డును గెలుచుకొన్నది.

సెన్సార్‌పై దర్శకుడి పోరాటం
సెన్సార్ కోరల్లో చిక్కుకొన్న ‘లిపిస్టిక్ అండర్ మై బుర్కా' చిత్రంపై పెట్టిన నిషేధాన్ని తొలగించాలంటూ దర్శకురాలు అలంకృత పోరాటం చేస్తున్నారు. ‘ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నప్పుడు భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశం భయపడుతుందని ఊహించలేదు. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. అశ్లీల సన్నివేశాలు, సంభాషణలు ఉన్నాయని అధికారులు కారణం చూపి నిషేధం విధించారు' అని ఆమె వెల్లడించారు.

సినిమా కథ ఏంటంటే..
దేశంలోని మారుమూల ప్రాంతంలో ఉన్న ఓ చిన్న గ్రామంలో నలుగురు మహిళలు స్వేచ్ఛ వైపు అడుగులు వేయగా వారికి ఎదురైన సమస్యలేమిటి అనేది చిత్ర కథ. ఈ సినిమాలో డైలాగ్‌లు సంప్రదాయ చిత్రాల్లో కనిపించే సంభాషణలకు భిన్నంగా వినిపిస్తాయి. అలాంటి అంశాలు సంప్రదాయ వాదులు జీర్ణించుకోలేరనే సెన్సార్ వాదన.

‘బుర్ఖా'పై షారుక్ ఖాన్ స్పందన
లిపిస్టిక్ అండర్ మై బుర్ఖాపై విధించిన నిషేధంపై బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ స్పందించారు. సెన్సార్ వివాదంలో ఉన్నప్పుడు ఈ చిత్రంపై మాట్లాడటం తగదు. కావాలంటే ఉత్తర ప్రదేశ్ రాజకీయాల గురించి అడుగు. ఇంకా ఏమైనా అడుగండి సమాధానాలు చెప్తాను అని ఆయన అన్నాడు.

దర్శకుడు కబీర్ ఖాన్‌పై మండిపాటు
సెన్సార్ తీరుపై బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ మండిపడ్డాడు. దేవుడా మళ్లీ ఇదేమిటీ? సెన్సార్ తీరు జోక్‌గా మారింది అని అన్నారు. సల్మాన్‌తో కబీర్ ఖాన్ ఏక్ థా టైగర్, బజ్‌రంగీ బాయ్‌జాన్ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











