»   » రామ్ చరణ్ ఐటం గర్ల్ బికినీలో రచ్చ.... (హాట్ ఫొటోలు)

రామ్ చరణ్ ఐటం గర్ల్ బికినీలో రచ్చ.... (హాట్ ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సూపర్ మోడల్ లీసా హేడన్ రచ్చ సినిమాలో ఐటెమ్ సాంగ్ లో అదరకొట్టిన సంగతి తెలిసిందే. ఆమెను టాలీవుడ్ పెద్దగా ఎంకరేజ్ చేయలేదు కానీ...బాలీవుడ్ లో మాత్రం బాగానే వర్కవుట్ అవుతోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో ఆమె మాగ్జిమ్ ఇండియా మ్యాగజైన్ 2015 లో కనపడి రచ్చ రచ్చ చేసింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ప్రతి ఒక్కరికీ ఓ టైమ్‌ వస్తుందంటారు. ఎంత కష్టించినా..లభించని పేరు, గుర్తింపు ఓవర్‌నైట్‌లో వాటంతట అవే తన్నుకొచ్చేసే సందర్భాలు మనిషి జీవితంలో తారసపడతాయి. ప్రస్తుతం బాలీవుడ్‌ హాట్‌గాళ్‌ లీసా హేడెన్‌ పరిస్థితి అదే. లాక్మే ఇండియా ఫ్రెష్‌ఫేస్‌గా పరిచయమైన ఈ భామ మోడల్‌గా చాలాకాలం కెరీర్‌ సాగించింది.

'నేను పుట్టి పెరిగింది ఆస్ట్రేలియాలో.. మోడలింగ్ రంగం నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టా.. నాలుగు సినిమాలు చేశా.. ప్రస్తుతం నా హిందీ బాగా మెరుగుపడింది. ..' అని ప్రముఖ మోడల్, నటి లిసా హైడన్ ముద్దుగా హిందీలో చెప్పింది.

లీసా హేడెన్ హాట్ ఫొటోలు స్లైడ్ షోలో...

అదే నా డ్యూటీ

అదే నా డ్యూటీ

'నాకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడమే నా డ్యూటీ. అంతే తప్ప దాని ముందు వెనుక కథలను పట్టించుకోను'ని లిసా స్పష్టం చేసింది.

ఆనందంగా ఉంది

ఆనందంగా ఉంది

కాగా, ఇంతకుముందు తాను నటించిన 'క్వీన్' సినిమా కూడా తనకు మంచి పేరు తెచ్చి పెట్టిందని, ప్రస్తుతం అందరూ తనను గుర్తు పడుతున్నారని లిసా ఆనందం వ్యక్తం చేసింది.

తొలి పరిచయం

తొలి పరిచయం

అనీల్‌కపూర్‌ పరిచయంతో ‘ఐసా'లో ఓ పాత్రలో మెరిసింది.

ఆ తర్వాత

ఆ తర్వాత

ఆ సినిమా తర్వాత డేవిడ్‌ధావన్‌ ‘రాస్కెల్స్‌'లో అవకాశం అందిపుచ్చుకుంది. సంజయ్‌దత్‌, అజయ్‌దేవ్‌గన్‌, కంగన..లాంటి సీనియర్‌ నటులతో కలిసి నటించిన ఈ భామ తనదైన మార్కుతో కంగనను వెనక్కి నెట్టేసింది. సంజయ్‌తో కంగన వివాదం దరిమిలా..ప్రోమోల్లో అసలు కంగన కనిపించకుండా పోయింది.

ఆమె పేరే

ఆమె పేరే

దర్శకనిర్మాతలు రింగుల జుత్తు సుందరిని పక్కనబెట్టి..ట్రైలర్స్‌లో లీసాను హైలైట్‌ చేశారు. దాంతో ఉత్తరాదిన ఏ నోట విన్నా లీసా పేరే వినిపిస్తోందిట. అదేగాక వరుసగా అవకాశాలు ఈ అమ్మడి వెంటపడుతున్నాయని సమాచారం.

హీరోయిన్ గా ...

హీరోయిన్ గా ...

ఆ మధ్యన విడుదలైన 'షౌకీన్'లో ఆమె హీరోయిన్‌గా నటించింది. ఇది 1982లో విడుదలైన సూపర్‌హిట్ రొమేంటిక్ కామెడీ సినిమా 'షౌకీన్'కు రీమేక్. ఇందులో సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్‌తోపాటు, పరేష్ రావల్, అనుపమ్ ఖేర్, అన్నూకపూర్ వంటి సీనియర్ నటులు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా కూడా ఆమెకు కలిసి రాలేదు.

అనుకున్నా కానీ...

అనుకున్నా కానీ...

'షౌకీన్'లో రతీ అగ్నిహోత్రి పోషించిన పాత్రను ప్రస్తుతం రీమేక్‌లో లిసా పోషిస్తోంది. ఈ పాత్రకు మొదట నర్గిస్ ఫక్రిని తీసుకోవాలని అనుకున్నారు.

అలా వచ్చింది

అలా వచ్చింది

అయితే అప్పటికే ఆమె హాలీవుడ్ సినిమా 'స్పై'కి ఒప్పందం చేసుకుని ఉండటంతో డేట్స్ కేటాయించలేకపోయింది. దాంతో 'షౌకీన్' అవకాశం లిసాను వరించింది. అయితే ఇవేమీ తనకు పట్టవని ఆమె చెప్పింది.

English summary
Lisa Haydon has taken it up to herself to raise the temperature with her hot swimsuit photo shoot for the Maxim India magazine’s photo shoot for the June 2015 issue. Lisa is looking hot and sultry in various bikini and swimsuits that she is seen posing in.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu