'రచ్చ'లో ఆ హీరోయిన్ ఐటం సాంగ్
బాలీవుడ్ లో 'రాస్కెల్స్', 'ఆయేషా'చిత్రాలలో హీరోయిన్ గా చేసిన లీసా హైడెన్ ఇప్పుడు తెలుగు తెరపై మెరవనుంది. రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చలో ఆమె ఐటం సాంగ్ చేయనుంది. ఈ పాట హీరో ఇంట్రడక్షన్ సాంగ్ గా వస్తుంది. మణిశర్మ కంపోజ్ చేసిన ఈ పాట యూత్ కి బాగా పడుతుందని చెప్తున్నారు. ఈ పాట కోసం ఆమె హైదరాబాద్ వచ్చింది. ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఆ పాటను చిత్రీకరించారు. ఇటీవలే హైదరాబాద్‌లో ప్రేమ్ రక్షిత్ నృత్యరీతులు సమకూర్చగా ఆ గీతాన్ని తెరకెక్కించారు.రామ్ చరణ్,ఆమె ఈ పాటలో కలిసి స్టెప్స్ వేసారు. ఇక రచ్చ చిత్రాన్ని మహా శివరాత్రి కానుకగా అందించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన తమన్నా నటిస్తోంది.
మాస్ మసాలా, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పరాస్ జైన్, ఎన్.వి.ప్రసాద్ మెగా సూపర్ గుడ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఫిబ్రవరిలో ఆడియో, మార్చిలో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.'రచ్చ' సినిమా ఓవర్సీస్ రైట్స్ రికార్డు స్థాయిలో రూ. 2.75 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. హరి వెంకటేశ్వర పిక్చర్స్ ఈ హక్కులు దక్కించుకున్నట్లు సమాచారం. ఈ సంస్థ కంప్లీట్ అబ్రాడ్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు, డివిడి రైట్స్ కూడా దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఆరెంజ్ సినిమా విడుదలైన చాలా రోజులకు 'రచ్చ' సినిమా విడుదలవుతుండటంతో బిజినెస్ భారీగానే ఉంటుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











