»   » మహేష్ ఒకప్పటి హీరోయిన్, కాన్సర్ బారిన పడ్డా.. చెక్కు చదరలేదు ( రీసెంట్ ఫొటోలు)

మహేష్ ఒకప్పటి హీరోయిన్, కాన్సర్ బారిన పడ్డా.. చెక్కు చదరలేదు ( రీసెంట్ ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఈ మధ్యకాలంలో బాలీవుడ్ అనుసరిస్తున్న సెల్ఫ్ ప్రమోషన్ వ్యూహం ఏమిటి అంటే...ఓ హాలీవుడ్ ట్రిప్ కు ఓ అందమైన ప్రదేశానికి వెళ్లటం , అక్కడ కొన్ని హాట్ హాట్ ఫొటోలు దిగటం, సైలెంట్ తన అభిమానుల కోసం అన్నట్లు గా సోషల్ మీడియాలో షేర్ చేయటం చేస్తున్నారు. ఖచ్చితంగా సెలబ్రెటీల ఫొటోలు, అందునా హాట్ ఫొటోలు కాబట్టి ఖచ్చితంగా మీడియా ఓ రేంజిలో కవరేజ్ ఇస్తుంది. తాజాగా లీసారే కూడా ఈ బ్యాచ్ లో చేరింది.

అప్పట్లో మహేష్ బాబు సరసన టక్కరి దొంగ చిత్రంలో హీరోయిన్ గా చేసిన లీసారే గుర్తుందా... ఆమె ను ఎప్పుడు మర్చిపోయాం అంటారా. ఓ తరాన్ని తన మోడలింగ్ ఒంపుసొంపులతో ఒక ఊపు ఊపి, తర్వాత పెళ్లి చేసుకుని సెటిలైన ఈ భామ రీసెంట్ గా లెబానాన్ కు హాలీడే ట్రిక్ కు వెళ్లింది. అక్కడ దిగిన తన హాట్ హాట్ ఫొటోలను ఇదిగో ఇలా షేర్ చేసింది.

ఈ మధ్య కాలంలో లీసారే ఫొటోలు మనం చూసింది లేదు. దానికి తోడు ఆమెకు కాన్సర్ సైతం సోకింది. కానీ ప్రమాదమైన కాన్సర్ తన శరీరంలో ఉన్నా...ట్రీట్ మెంట్ తీసుకున్నా ..ఎక్కడా తన రూపాన్ని చెక్కు చెదరనీయకుండా మెయింటైన్ చేయటం అంటే మాటలు కాదు. పోనీ వయస్సు ఏమన్నా తక్కువా అంటే 44.

స్లైడ్ షో లో ఈ భామ ఫొటోలు

కాన్సర్ ఉన్నాకఠోర సాధనతో

కాన్సర్ ఉన్నాకఠోర సాధనతో

నిజానికి అందాన్ని కాపాడుకోవడం అంటే ఆషామాషీ కాదు...అందునా క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రుగ్మత శరీరాన్ని ఉన్నప్పుడు మరీను. కానీ . చెక్కు చెదరని రూపురేఖల్ని మెయింటెయిన్ చేయడం తనకే సాధ్యం అంటోంది లీసారే. కానీ ఆత్మవిశ్వాసంతో కఠోర సాధనతో అదంతా సాధ్యమేనని నిరూపిస్తోంది ''టక్కరి దొంగ'' హీరోయిన్ లీసారే.

కాన్సర్ తనను తినేస్తున్నా ...

కాన్సర్ తనను తినేస్తున్నా ...

ఈ మోడల్ కం నటి వయసు ఇప్పుడు 44. నటనను విడిచిపెట్టి చాలా కాలమే అయ్యింది. క్యాన్సర్ కోసం నిత్యం ట్రీట్ మెంట్ జరుగుతూనే ఉంది. క్యాన్సర్ మహమ్మారీ తనని వేదిస్తూనే ఉంది. అయినా ఇప్పటికీ చెక్కు చెదరని రూపాన్ని మెయింటెయిన్ చేస్తూ ఇండస్ర్టీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. బాలీవుడ్ హీరోయిన్స్ ఇప్పటికి ఆమెను చూసి ఆశ్చర్యపోతూనే ఉంటారు.

టీనేజ్ అమ్మాయిలా..

టీనేజ్ అమ్మాయిలా..

అరుదైన క్యాన్సర్తో బాధపడుతున్న ఈ బాలీవుడ్ భామ ఇప్పటికీ నవయవ్వన కాంతులతో తులతూగుతోంది. శరీరంలో క్యాన్సర్ సెల్స్ల్ కంట్రోల్లో ఉన్నా డిసీజ్ పూర్తిగా క్యూర్ కాలేదు. కాని ఈమె టీనేజీ అమ్మాయిలా ఫోటోషూట్లకు ఫోజులిస్తూ దడదడలాడిస్తోంది. 2002లో మహేష్ బాబు సరసన 'టక్కరి దొంగ'లో నటించిన లీసా ఓ ఎన్నారై ఇండియన్.

జబ్బు గురించి వింటే భాధ వేస్తుంది

జబ్బు గురించి వింటే భాధ వేస్తుంది

లీసారేకు 2009లో మల్టిపుల్ మైలోమా అనే అరుదైన క్యాన్సర్ రావడంతో ఈమె బాహ్య ప్రపంచం నుంచి మిస్సయ్యింది. మంచి ఆహారపు అలవాట్లు యోగా ధ్యానం సాధనతో ప్రస్తుతం మనసులోని బాధల్ని అధిగమిస్తోంది. ఇలాంటి కాన్సర్ తో బాధపడేవారు చాలా తక్కువ మంది ఉన్నారట. అయితే తనను కాన్సర్ జయించకూడదని, తనే కాన్సర్ ని జయించాలని ఫిక్సే ఇలా గెలిచి, ముందుకెళ్తోంది.

అదిరిపోయే పంచ్ వేసింది

అదిరిపోయే పంచ్ వేసింది

ఆ మధ్యన లీసారే మీడియాకు ఓ పవర్ పుల్ పంచ్ వేసింది. ''అసలు హీరోయిన్లను - మోడళ్ళను ప్రజలు చూసే తీరు మారాలంటే ముందుగా మీడియా మారాలి. ఎందుకంటే మీరు మా ప్రతీ ఫోటోనూ ఫోటో షాప్ లో టచ్చింగ్ చేసి.. సన్నని నడుం ఉన్నట్లు.. అద్బుతమైన షేపులు ఉన్నట్లు చూపిస్తున్నారు. దాని కారణంగా యూత్ తమ జీవితాల్లోని అమ్మాయిలు కూడా అలాగే ఉండాలని అనుకుంటున్నారు. దానితో బోలెడన్ని సమస్యలు వస్తున్నాయి.. మీడియా మారితే.. మా శరీరాన్ని ఉన్నది ఉన్నట్లు చూపిస్తే.. అది సొసైటీకి మంచిది'' అంటూ కామెంట్లు చేసింది లీసా రే.

జీవిత భాగస్వామితోనే శృగారం

జీవిత భాగస్వామితోనే శృగారం

సరదాలు, షికార్లు, పార్టీలు... భాగస్వామితో చేస్తేనే సంతోషంగా, రొమాంటిక్‌గా ఉంటుందనేది లీసారే సూచన. కొత్త స్నేహాలు కొత్త ప్రమాదాలకు దారి తీయొచ్చన్నది ఆమె సలహా. శృంగార సందేశాల తర్జుమా, తీపి గుర్తులు నెమరేసుకోవడం బంధాన్ని పదిల పరుస్తాయంటోంది లీసారే. చాలా మంచి సలహాలే చెప్పింది కదూ..

ఈ కవిత్వం చదివారా..లీసారే రాసింది

ఈ కవిత్వం చదివారా..లీసారే రాసింది

నువ్వు మరిచిపోయావేమో..?
చాలా అందంగా ఉంటావని...
ఒక అపరిచితుడు బార్‌లో కూర్చుని పుస్తకం చదువుతూ నిన్ను చూసిన దొంగచూపుల్లో తెలిసింది నీకు నీ అందమేమిటో. ఎందుకంటే అతని ఫోన్ అప్పుడు ఛార్జింగ్ పెట్టాడు - లీసా రాణిరే. ఈరోజుల్లో మనుషులు అసలు పుస్తకాలు చదవడమే మరిచిపోయి పూర్తిగా మొబైల్లోనే మునిగిపోయారని అందంగా చెప్పంది లీసారే. క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన లీసా ఈ మధ్యే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రొటెస్ట్‌పోయెట్ పేరుతో కవితలు రాస్తున్నది. ప్రస్తుత రోజుల్లో సమాజ పోకడల గురించి చెప్తూ లీసా రాసిన కవితలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు హాట్‌టాపిక్.

అవగాహన కోసం పుస్తకం రాస్తున్నా

అవగాహన కోసం పుస్తకం రాస్తున్నా

‘మల్టిపుల్ మిలోమా' అనే కేన్సర్‌కు గురై కోలుకున్న ప్రముఖ నటి, మోడల్ లీసారే కేన్సర్‌పై అవగాహనకు ఓ పుస్తకం రాస్తానని చెబుతోంది. కేన్సర్‌పై ప్రజల్లో అవగాహనకు ఆమె ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇండో-కెనడియన్ అయిన ఈ నటి దాదాపు 10 నెలల పాటు మల్టిపుల్ మిలోమాతో పోరాడి చివరకు దాన్ని జయించింది. వ్యాధి నుంచి విముక్తి పొందాక తనలో ఆత్మవిశ్వాసం మరింతగా ఇనుమడించిందని ఆమె పలు సందర్భాల్లో చెప్పింది. ఆమెలో నూతనోత్సాహం తొణికిసలాడుతోంది.

సెక్సీ మోడల్ నుంచి కాన్సర్ ని ఎదిరించేదాకా

సెక్సీ మోడల్ నుంచి కాన్సర్ ని ఎదిరించేదాకా

లిసారే సెక్సీ మోడల్. కెనడా మోడలింగ్ రంగం నుంచి బాలీవుడ్ పరిశ్రమకు ఎగిరొచ్చిన పేజ్-3 గాళ్. అందగత్తె మాత్రమే కాదు. అదృష్టవంతురాలు కూడా. అటు మోడలింగ్, ఇటు సినీ కెరీర్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్న సమయంలోనే -ఆమె ఆరోగ్యాన్ని క్యాన్సర్ కబళించింది. ఆస్పత్రిలో మరణశయ్య మీదకు చేర్చింది. అంతమాత్రాన లిసారే బెదిరిపోలేదు. జీవితం ఇంతేననుకుని నిస్సారంగా ప్రయాణాన్ని ఆపేయలేదు. ప్రాణం ఉన్నంతవరకూ పోరాడాలన్న నిశ్చయంతో వైద్యం తీసుకుంటూనే కెరీర్‌ను కొనసాగించింది.

పునర్జన్మ ఎత్తాను

పునర్జన్మ ఎత్తాను

చివరకు లిసారే తెగింపు ముందు -క్యాన్సర్ తలవంచక తప్పలేదు. మరణశయ్య నుంచి మళ్లీ లేచి నిలబడిన లిసారేను ఆమధ్యన అనుకోని అదృష్టమే వరించింది. కెనడాలో క్వీన్ ఎలిజిబెత్ -2 హాజరవుతోన్న ఉన్నత కార్యక్రమానికి హోస్ట్ బాధ్యతలు నిర్వర్తించే అవకాశం దక్కింది. ‘టొరెంటోలో క్వీన్ ఎలిజిబెత్ హాజరవుతోన్న కార్యక్రమాన్ని నేను హోస్ట్ చేసా. పునర్జన్మ ఎత్తిన నాకు ఇలాంటి అవకాశం దక్కడం గొప్ప గౌరవమే కాదు, మరింత ప్రేరణ, అమితమైన బలం కూడా' అంటూ ఆనందం వ్యక్తం చేసింది లిసారే

ఇంత గొప్ప వితరణ

ఇంత గొప్ప వితరణ

ప్రధాన పాత్రలో లిసారే కనిపించిన ‘కుకుంగ్ విత్ స్టెల్లా' సినిమాను యుఎస్‌లో ఇటీవలే ఆరంభమైన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించార్ట. ఆ సందర్భంగా వచ్చిన మొత్తాన్ని -లాస్ ఏంజెల్స్‌లోని ఓ బోన్ క్యాన్సర్ పరిశోధనా కేంద్రానికి వితరణగా ఇచ్చేసిందట లిసారే. గ్రేట్ కదూ!

రీఎంట్రీ

రీఎంట్రీ

లీసారే నాలుగేళ్ల ఏళ్ల క్రితం జేసన్‌డెనీ అనే వ్యక్తిని పెళ్లాడారు. లిసారే వెండితెరపై కనిపించి దాదాపు నాలుగేళ్ల పైనే అయింది. కొంత విరామం తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో లిసారే ‘ఇష్క్ ఫర్ ఎవర్' అనే హిందీ చిత్రంలో నటించడానికి సంతకం చేసింది. ఈ చిత్రంతో మళ్లీ లిసారేకు పూర్వవైభవం వస్తుందని ఆశిద్దాం...

లవ్ లైఫ్ ఎంజాయ్ చేసాకే

లవ్ లైఫ్ ఎంజాయ్ చేసాకే

ఇండో-కెనడియన్ అయిన లీసారే తన బాయ్ ఫ్రెండ్ జాసన్ డెన్నిని అక్టోబర్ 20న కాలిఫోర్నియాలోని నేపా వ్యాలీలో పెళ్లాడింది. గత కొన్ని సంవత్సరాలుగా లిసా రే, జాసన్ డెన్ని ప్రేమించుకున్నారు. జాసన్ డెన్ని లిసా రేకు పెళ్లి ప్రపోజ్ చేసాడు. జాసన్ డెన్నిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆనందంగా ఉంది అంటూ ట్విట్టర్ ద్వారా లిసా రే తన ఆనందాన్ని వెలుబుచ్చింది.

 అదో ప్రశ్నగా మిగిలింది

అదో ప్రశ్నగా మిగిలింది

‘నేనొక దేశదిమ్మరిని. ప్రకృతిపరంగా వివిధ రకాల అనుభవాలను నా మనసు కోరుకుంటుంది. చిన్నతనంలో ఒకేచోట ఉండేదాన్ని. ఇప్పుడు జీవితంతోపాటు పరిశ్రమ కూడా మారిపోయింది. నాకు ఇక్కడ ఎన్నో ప్రాజెక్టులు దక్కబోతున్నాయి. వెనక్కివచ్చేయాలనే ఆలోచన ఏనాటినుంచో ఉంది.అయితే ఎప్పుడు రావాలనేదే ఓ ప్రశ్నగా మిగిలిపోయింది' అని అంది లిసారే.

వృత్తిపరిమైన కారణాలే కాదు వ్యక్తిగతమైనవి కూడా

వృత్తిపరిమైన కారణాలే కాదు వ్యక్తిగతమైనవి కూడా

‘నన్ను తీర్చిదిద్దిన నగరంలో మరింత సమయం గడపాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గుర్తించాను. ఏ దేశంలో ఉన్నప్పటికీ నా మనసులో కొంత భాగం భారతదేశంలోనే ఉండేది. నా జీవితానికి సంబంధించి మరికొంత స్పష్టత రావాల్సి ఉంది. నా జీవితానికి ఏది వర్తిస్తుంది ? ఏది వర్తించదు? అనే విషయం నాకు బాగా తెలుసు. నాకు నా స్నేహితులు ఎంతో ముఖ్యం. ఇందుకు వ్యక్తిగతమైన కారణాలతోపాటు వృత్తిపరమైన కారణాలు కూడా ఉన్నాయి' అని అంది.

English summary
The gorgeous Lisa Ray is having an amazing time holidaying in Lebanon with her husband Jason Dehni. Her Instagram pictures are filled with exotic locales and we just can't stop looking at them. The images look so peaceful and stressfree!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu