'సాహో'పై ప్రముఖ హీరోయిన్ ఫైర్.. ఫ్రాడ్ చేశారంటూ రచ్చ!
ప్రభాస్ హీరోగా వచ్చిన కొత్త సినిమా 'సాహో'. భారీ అంచనాల నడుమ ఆగస్టు 30 న విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది. సినిమాపై నెగెటివ్ రివ్యూస్ రావడంతో నిరాశ చెందింది చిత్రయూనిట్. ఇంతలో సోషల్ మీడియా వేదికగా సాహో చిత్రయూనిట్ పై ఓ హీరోయిన్ విమర్శలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి పోతే..

బేబీ ఓన్ట్ యు టెల్ మీ.. సాంగ్
ప్రభాస్, శ్రద్ద కపూర్ లపై షూట్ చేసిన ''బేబీ ఓన్ట్ యు టెల్ మీ..'' సాంగ్ కి సంబంధించి ప్రముఖ హీరోయిన్ లీసారే మండిపడింది. విదేశాల్లోని అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించిన షాట్స్ ఈ సాంగ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. శ్వేతా మోహన్, సిద్ధార్థ్ మహదేవన్, శంకర్ మహదేవన్ ఆలపించారు.

అదంతా కాపీ అంటూ
అయితే సాంగ్ తాలూకు పోస్టర్.. ఓ క్రియేటర్ సృష్టించిన ఆర్ట్ వర్క్‌ని పూర్తిగా కాపీ కొట్టినట్టు ఉందని ఆరోపించింది లీసారే. ఈ మేరకు ఇన్స్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెడుతూ సాహో టీమ్ పై విరుచుకు పడింది. ఒరిజినల్ ఆర్ట్ వర్క్ తో పాటు ప్రభాస్, శ్రద్ధా కపూర్ లు ఉన్న పోస్టర్ ను షేర్ చేస్తూ ఏం తేడా ఉందని ప్రశ్నించింది. దీంతో ఈ ఇష్యు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
చోరీకి గురైన క్రియేటివిటీ
కాపీ కొట్టడం సరైంది కాదనే విషయం మూవీ మేకర్స్‌కు తెలియాలి. ఇది ముమ్మాటికీ ఇతరుల క్రియేటివిటీని చోరీ చేయడమే అవుతుంది. కనీసం ఆ ఆర్ట్ డైరెక్టర్ షిలోను సంప్రదించలేదు, పైగా ఆమె అనుమతిని తీసుకోవడం కానీ, లేదా ఆమెకు క్రెడిట్ ఇవ్వడం కానీ చేయలేదు. ఇలాంటి పనులు అస్సలు సహించలేం అంటూ అని లీసా రే మండిపడింది. దీనిపై నిర్మాతలు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేసింది.

సాహో మూవీ
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కింది సాహో సినిమా. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు.


Click it and Unblock the Notifications











