మహేష్ బాబు హీరోయిన్ ‘లీసా రే’ వెడ్డింగ్ ఫోటోస్
కాలిఫోర్నియా: మోడల్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ గా బాలీవుడ్లో అడుగుపెట్టిన ఇండో కెనడియన్ భామ లిసా రే. ఆ మధ్య కేన్సర్ బారిన పడి సినిమాలకు దూరమైన లిసా రే ఆ వ్యాధితో పోరాడి మళ్లీ కోలుకుంది. మహేష్ బాబు సరసన 'టక్కరి దొంగ' చిత్రంలో హీరోయిన్ గా నటించిన లిసా రే ఇటీవల అక్టోబర్ 20న కాలిఫోర్నియాలోని నేపా వ్యాలీలో తన బాయ్ ఫ్రెండ్ జాసన్ డెన్నిని పెళ్లి చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇవే...

ఇండో-కెనడియన్ అయిన లీసారే తన బాయ్ ఫ్రెండ్ జాసన్ డెన్నిని అక్టోబర్ 20న కాలిఫోర్నియాలోని నేపా వ్యాలీలో పెళ్లాడింది.

గత కొన్ని సంవత్సరాలుగా లిసా రే, జాసన్ డెన్ని ప్రేమించుకున్నారు. గత ఫిబ్రవరిలో జాసన్ డెన్ని లిసా రేకు పెళ్లి ప్రపోజ్ చేసాడు.

జాసన్ డెన్నిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆనందంగా ఉంది అంటూ ట్విట్టర్ ద్వారా లిసా రే తన ఆనందాన్ని వెలుబుచ్చింది.

పెళ్లి తర్వాత కొత్తగా ప్లానింగ్స్ ఏమీ లేవని, పెళ్లి తర్వాత కూడా ఎప్పటిలాగే తన లైఫ్ ఉంటుందని లిసా రే పేర్కొంది.

లిసా రే వెడ్డింగ్ డ్రెస్ ఆమె క్లోజ్ ఫ్రెండ్ వెండెల్ రాడ్రిక్స్ డిజైన్ చేసారు.

ఈ పెళ్లి వేడుకలో లిసారే క్లోప్ ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు.

లిసా రే భర్త జాసన్ డెన్ని ప్రొఫెషన్...ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్.


Click it and Unblock the Notifications