twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Villains 2022: ఈ ఏడాది విలన్లుగా అదరగొట్టిన హీరోలు.. ఎవరెవరంటే?

    |

    ప్రస్తుతం సినీ ప్రియల అభిరుచి మారుతూ వస్తోంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో విభిన్నమైన చిత్రాలు, పాన్ ఇండియా సంస్కృతి ప్రభావంతో హీరోలు, దర్శకుల ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. కథనాయకుడు అంటే ఫలానే రోల్స్ కే కట్టుబడి ఉండాలి, అలాంటి కథలనే ఎంచుకోవాలనే తీరు రానురాను పోతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో హీరోలు కథానాయకుడిగానే కాకుండా ప్రతినాయకుడిగా కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇంతకుముందు విలన్ల నుంచి హీరోలుగా మారిన ఎందరో స్టార్స్ ఉన్నారు. తాజాగా హీరోగా ఫుల్ ఎస్టాబ్లిష్ అయిన స్టార్స్ పవర్ ఫుల్ గా మెప్పిస్తున్నారు. ఈ 2022లో విలన్ గా నటించిన ఆ హీరోలు ఎవరో ఓ లుక్కేద్దామా!

    సత్యదేవ్..

    సత్యదేవ్..

    మెగాస్టార్ చిరంజీవి ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత అలరించిన చిత్రం గాడ్ ఫాదర్. మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ నటించిన మలాయళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ లూసీఫర్ కు రీమెక్ గా ఈ చిత్రం వచ్చింది. అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదలైన ఈ సినిమాలో విలన్ గా సత్యదేవ్ ఆకట్టుకున్నాడు. నటనలో ఎంతో నైపుణ్యం ఉన్న మెగాస్టార్ చిరంజీవికి ప్రతినాయకుడిగా అంటే చాలా కష్టమైన విషయం. కానీ తనకున్న అనుభవంతో తన ప్రతిభను చాటుకున్నాడు సత్యదేవ్.

    రానా దగ్గుబాటి..

    రానా దగ్గుబాటి..

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్-రానా దగ్గుబాటి కలిసి నటించిన చిత్రం భీమ్లా నాయక్. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు రీమెక్ గా వచ్చిన ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా పవన్ కల్యాణ్, ఆర్మీ నుంచి రిటైర్ అయి పొగరున్న వ్యక్తిగా కొంచెం నెగెటివ్ షేడ్స్ లో రానా దగ్గుబాటి అలరించారు. ఇదివరకు ప్రభాస్ బాహుబలి సినిమాలో భళ్లాలదేవుడిగా రానా దగ్గుబాటి ఎలాంటి క్రేజ్ తెచ్చుకున్నాడో తెలిసిందే.

    ఆది పినిశెట్టి...

    ఆది పినిశెట్టి...

    హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి. ఇదివరకు ఆది పినిశెట్టి వైరం ధనుష్ గా సరైనోడు చిత్రంలో అల్లు అర్జున్ తో తలపడిన విషయం తెలిసిందే. ఇందులో సూపర్ స్టైలిష్ విలన్ గా ఆకట్టుకున్నాడు. ఇక తాజాగా రామ్ పోతినేని ది వారియర్ చిత్రంలో గురుగా పూర్తి మాస్ విలన్ గా అలరించాడు ఆది పినిశెట్టి. ఎన్ లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్, ఆది పినిశెట్టి మధ్య వచ్చిన పోరాటపు సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.

    హీరో కార్తికేయ..

    హీరో కార్తికేయ..

    నేచురల్ స్టార్ నాని గ్యాంగ్ లీడర్ చిత్రంతో తొలిసారిగా విలన్ గా నటించాడు RX100 మూవీ హీరో కార్తికేయ. ఈసారి 2022లో కోలీవుడ్ యాక్షన్ హీరో అజిత్ నటించిన వలిమై మూవీలో ప్రతినాయకుడిగా నటించాడు కార్తికేయ. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తికేయను నరేన్ గా అలరించాడు కార్తికేయ. ఇక ఇందులో కార్తికేయకు అజిత్ కు మధ్య వచ్చే మైండ్ గేమ్ ఆకట్టుకునేలా తెరకెక్కించారు.

    సూర్య అండ్ విజయ్ సేతుపతి..

    సూర్య అండ్ విజయ్ సేతుపతి..

    2022లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సినిమాల్లో లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ ఒకటి. లోకేషన్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ మూవీలో రోలెక్స్ గా స్టార్ హీరో సూర్య అదరగొట్టాడు. కనిపించింది 15 నిమిషాలే అయినా సినిమాను ఓ రేంజ్ కి తీసుకెళ్లాడు. కమల్ హాసన్, మిగతా పాత్రలను డామినేట్ చేసేంతలా సూర్య ఉన్నాడని పలువురు అభిప్రాయపడ్డారు. ఇక ఇందులోనే మరోక విలన్ సంతానం గా విజయ్ సేతుపతి కూడా ఆకట్టుకున్నాడు. ఓ వైపు డ్రగ్ డీలర్ గా, మరోవైపు ఫ్యామిలీని కాపాడుకునే వ్యక్తిగా సూపర్బ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇదివరకు విజయ్ మాస్టార్ సినిమాలో కూడా విలన్ గా ఆకట్టుకున్నాడు విజయ్ సేతుపతి.

    అధీరాగా సంజయ్ దత్..

    అధీరాగా సంజయ్ దత్..

    కన్నడ నుంచి వచ్చి బిగ్ హిట్ సాధించిన చిత్రం కేజీఎఫ్. దీనికి సీక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్ 2లో పవర్ ఫుల్ విలన్ అధీరాగా బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ సౌత్ ప్రేక్షకులను పలకరించాడు. బీకరమైన అవతారంతో విలన్ కి సరికొత్త అర్థం చెప్పాడు. ఇక బాలకృష్ణ అఖండలో శ్రీకాంత్ ప్రతినాయకుడిగా చాలా కాలం తర్వాత కనిపించాడు. ఇక అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో మలయాళ హీరో ఫహాద్ పాజిల్ నెగెటివ్ క్యారెక్టర్ లో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

    English summary
    Goodbye 2022: Best Heroes As Villains In 2022. Satya Dev Suriya Aadhi Pinisetty Rana Daggubati Kartikeya Vijay Sethupathi As Villains
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X