ఆ రెండు నెలలు సినీ లవర్స్ కి పండగే.. ఆ రెండు తప్ప అన్నీ పాన్ ఇండియా సినిమాలే!

చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా.. కంటెంట్ బాగుంటే.. ఆ సినిమాకు మనవాళ్లు పట్టం కడతారు. ఏ భాష అని చూడరు..సినిమా బాగుంటే.. హిట్ చేసేస్తారు. ఎన్ని ఓటీటీలు వచ్చినప్పటికీ.. సినిమాలు రిలీజ్ అంటే మాత్రం సినీ ప్రేమికులు థియేటర్లకు పరిగెత్తుతారు. అయితే ఈ సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వచ్చేవన్నీ దాదాపు పెద్ద సినిమాలే. సెప్టెంబర్ నెలలో ఐదు సినిమాలు రిలీజ్ అవతుండగా.. అక్టోబర్ నెలలో మూడు సినిమాలు రిలీజ్ అవతున్నాయి. ఈ ఎనిమిది సినిమాల్లో రెండు సినిమాలు తప్పించి.. అన్ని పాన్ ఇండియా సినిమాలే ఉండటం విశేషం. ఆ వివరాల్లోకి వెళ్తే...

విజయ్ సామ్ ల ఖుషి..:మొదటగా సెప్టెంబరు నెలలో రిలీజ్ అయ్యే సినిమాల విషయానకిి వస్తే.. ఈ నెలలో సినీ ప్రేమికులకు పండగే అని చెప్పవచ్చు. ఎందుకంటే.. ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో మొదటగా వస్తున్న సినిమా ఖుషి. మజిలి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు,తమిళ్, కన్నడ, మలయాళ సహా హిందీ భాషల్లో ఏకకాలంలో సెప్టెంబరు 1వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

List of movies releasing in September and October

జవాన్ గా షారుఖ్ ఖాన్:ఇక వారం గ్యాప్ తీసుకుని షారుక్ ఖాన్ జవాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తుండగా.. హీరోయిన్ నయన తార నటిస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇక ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

సిద్దు వర్సెస్ రామ్ పోతినేని:ఇక సెప్టెంబరు 15వ తేదీన రెండు సినిమాలు పోటీ పడుతున్నాయి. రామ్ పోతినేని, బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. ఇది అక్టోబర్ లో రిలీజ్ కానుండగా.. తాజాగా ఈ చిత్రాన్ని ప్రీ పోన్ చేశారు. ఇక ఇదే రోజున డీజే టిల్లు స్క్వేర్ అంటూ సిద్దు జోన్నల గడ్డ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అంటే బాక్స్ ఆఫీస్ వద్ద రామ్ వర్సెస్ సిద్ధు వార్ జరగనుందని తెలుస్తోంది. అయితే రామ్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతుండగా.. సిద్దు సినిమా తెలుగులోనే రిలీజ్ కానుంది.

List of movies releasing in September and October

సలార్ గా ప్రభాస్ ఎంట్రీ:ఇక ఇటీవల ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్.. నెక్ట్స్ సలార్ గా రానున్నాడు. కేజీఎఫ్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడం.. అందులోనూ ప్రభాస్ హీరోగా రూపొందుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 28 వతేదీన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా శృతి హాసన్ నటిస్తోంది.

List of movies releasing in September and October

దసరాకు బాక్సాఫీస్ వార్ పక్కా:ఇక అక్టోబర్ నెల విషయానికి వస్తే.. మూడు పెద్ద సినిమాలు రిలీజ్ కానున్నాయి. దసరా కానుకగా.. లోకేష్ కనగరాజ్, తలపతి విజయ్ కాంబోలో వస్తున్న చిత్రం లియె రానుంది. ఇక ఈ సినిమా విక్రమ్, ఖైదీ సినిమాలకు లింక్ ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలిజ్ అయిన టీజర్, పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. ఇక అక్టోబర్ 20 వ తేదీన రెండు సినిమాలు పోటీ పడుతున్నాయి. అందులో బాలకృష్ణ భగవంత్ కేసరీ కాగా... రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా. అయితే ఈ దసరాకు.. విజయ్ వర్సెస్ బాలయ్య వర్సెస్ రవితేజ వార్ ను చూడబోతున్నాం. ఈ వార్ లో బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరు నెగ్గుతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X