థియేటర్లలో సినిమాల జాతర.. తారకరత్న చివరి మూవీ రిలీజ్.. ఒక్కరోజే ఏకంగా 23

సినీ ప్రియులకు కేవలం ఎంటర్టైన్ మెంట్ ఇచ్చేవి సినిమాలే. అలాగే వీకెండ్ లో ఫ్యామిలీలతో ఎంజాయ్ చేసేందుకు మొదటగా ఎంచుకునే ఆప్షన్ మూవీనే. అందుకే ప్రతివారం కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాయి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం వంటి భాషల్లో సినిమాలు ప్రతివారం థియేటర్లలో విడుదలయ్యేందుకు రెడీగా ఉంటాయి. గతవారం నాలుగైదు చిత్రాలు థియేటర్లలో విడుదల కాగా ఈవారం మరికొన్ని సినిమాలు అలరించేందుకు సిద్దంగా ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దామా!

అన్నీ మంచి శకునములే: ఫ్యామిలీ ఆడియెన్స్ ను అలరించేందుకు సిద్ధంగా ఉన్న మహిళా దర్శకురాలు నందిని రెడ్డి డైరెక్టెడ్ మూవీ 'అన్నీ మంచి శకునములే'. యంగ్ హీరో సంతోష్ శోభన్, బ్యూటిఫుల్ మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా చేస్తున్న ఈ సినిమాకు స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా మే 18న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.

 List Of Upcoming

సామజవరగమన: మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు హీరో శ్రీవిష్ణు. ఆయన తాజాగా నటించిన మూవీ 'సామజవరగమన'. వివాహా భోజనంబు మూవీ డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మే 18న విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ ఆకట్టుకోగా.. ఇందులో బిగిల్, ఎఫ్ఐఆర్ ఫేమ్ రెబా మోనికా జాన్ హీరోయిన్ గా నటించింది. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండ నిర్మించగా.. గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు.

 List Of Upcoming

బిచ్చగాడు 2: తమిళ నటుడు విజయ్ ఆంటోనీకి తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. 'బిచ్చగాడు' సినిమాతో అద్భుతమైన విజయం అందుకున్న ఆయన దానికి సీక్వెల్ గా 'బిచ్చగాడు 2' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా మే 19న రిలీజ్ కానుంది.

 List Of Upcoming

తారకరత్న చివరి మూవీ: హీరో, నటుడు దివంగత నందమూరి తారకరత్న నటించిన చివరి సినిమా 'మిస్టర్ తారక్'. గత ఫిబ్రవరిలోనే సినిమాను రిలీజ్ చేయాల్సి ఉండగా.. తారకరత్న మరణం కారణంగా వాయిదా వేశారు. ఎట్టకేలకు ఈ సినిమాను మే 18న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. సైంటిఫిక్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాకు సీహెచ్ శంకర్ దొర దర్శకత్వం వహించారు.

 List Of Upcoming

ఫాస్ట్ ఎక్స్: వరల్డ్ వైడ్ గా యాక్షన్ అండ్ రేస్ చిత్రాలను ఇష్టపడే వారికి 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' మోస్ట్ ఫేవరెట్ గా ఉంటుంది. ఈ ఫ్రాంచైజీలో వచ్చే సినిమాలకు సూపర్ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ సిరీసులో వస్తున్న లేటెస్ట్ మూవీ ఫాస్ట్ ఎక్స్ (Fast X). విన్ డీజిల్ మెయిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో జాసన్ మొమొవా నెగెటివ్ రోల్ చేశారు. జస్టిన్ లిన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

 List Of Upcoming

మే 19న ఒక్కరోజే..: ఈ సినిమాలే కాకుండా ప్రియా ప్రకాశ్ వారియర్ లైవ్ (మలయాళం) మూవీ మే 19న రిలీజ్ కానుంది. గోస్మారి ఫ్యామిలీ మే 18న, శ్రీమంత, చార్లెస్ ఎంటర్ ప్రైజెస్, అమల, జాక్సన్ బజార్ యూత్, ఆజమ్, నీరజ, యాధుమ్ ఊరే యావరుమ్ కెలిర్, హసీనా, డేర్ డెవిల్ ముస్తఫా, టెనిడా అండ్ కంపెనీ, 8 ఏఎమ్ మెట్రో, మిస్సింగ్ గర్ల్ ఇలా మే 19న ఒక్కరోజే మొత్తంగా 23 సినిమాలు రిలీజ్ కానున్నాయి. అన్నీ కలిపి 27 విడుదల కానున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X