‘మా’ ఎన్నికలు: పోటీలో ఉన్నది వీరే.. ఎవరు ఏ ప్యానెల్ వైపు?
'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇటు శివాజీ రాజా ప్యానల్, అటు వికె నరేష్ ప్యానల్ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మే 10న పోలింగ్ తేదీ కావడంతో ఇరు వర్గాలు 'మా' మెంబర్లను కలిసి తమకే ఓటు వేయాలంటే.. తమకే ఓటు వేయాలంటూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
గత టర్మ్‌లో శివాజీ రాజాను అంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఈ టర్మ్‌లో వికె నరేష్‌ను అధ్యక్షుడిగా ఏకగ్రీవం చేద్దామని కొందరు ప్రతిపాదించారు. అయితే అందుకు కొందరు నిరాకరించడం, మాకు మరోసారి శివాజీ రాజా ప్రెసిడెంట్ కావాలనే డిమాండ్ తెరపైకి తేవడంతో ఎన్నికలు తప్పలేదు.

శివాజీ రాజా ప్యానల్ తరుపున పోటీలో ఉన్న ముఖ్య సభ్యులు
శివాజీ రాజా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంటుగా హీరో శ్రీకాంత్, జనరల్ సెక్రటరీగా రఘుబాబు బరిలో నిలిచారు.
ట్రెజరర్: రాజీవ్ కనకాల
వైస్ ప్రెసిడెంట్: బెనర్జీ
వైస్ ప్రసిడెంట్: ఎస్వీ కృష్ణారెడ్డి
జాయింట్ సెక్రటరీ: బ్రహ్మాజీ
జాయింట్ సెక్రటరీ: నాగినీడు

శివాజీ రాజా ప్యానల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి పోటీ చేస్తున్నవారు
తనీష్, ఉత్తేజ్, అనితా చౌదరి, బాలాజీ నవభారత్, పృథ్వీ రాజ్, భూపాల్ రాజు, సి. వెంకట గోవిందరావు, రాజా రవీంద్ర, డి రవి ప్రకాష్, ఏడిద శ్రీరామ్, హెచ్ జయలక్ష్మి, వేణు మాధవ్, సురేష్ కొండేటి, సాయి కుమార్, రాజ్ తరుణ్, సమీర్, తనికెళ్ల భరణి.

వికె నరేష్ ప్యానల్ ముఖ్య సభ్యులు
ప్రెసిడెంటుగా నరేష్ పోటీ చేస్తుండగా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజశేఖర్, జనరల్ సెక్రటరీ పదవికి జీవిత బరిలో నిలిచారు.
ట్రెజరర్: కోటా శంకర్ రావు
వైస్ ప్రెసిడెంట్: మానిక్
జాయింట్ సెక్రటరీ: శివ బాలాజీ
జాయింట్ సెక్రటరీ: గౌతం రాజు
వైస్ ప్రెసిడెంట్: హరనాథ్ బాబు

వికె నరేష్ ప్యానల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్
శ్రీముఖి, జెఎల్ శ్రీనివాస్, జాకీ, శ్రీనివాసులు, అలీ, లక్ష్మీ నారాయణ, అశోక్ కుమార్, ఎం.కృష్ణం రాజు, మధుమిత, కరాటే కళ్యాణి, వడ్లపట్ల, బాబీ, వింజమూరి మధు, కుమార్ కొమ్మకుల, సత్యం యాబి, లక్ష్మీకాంతరావు, మోహన్ మిత్ర, రాజేశ్వరి.


Click it and Unblock the Notifications











