ఒకరి తర్వాత ఒకరు..(టాలీవుడ్ స్టార్స్ విరాళాల లిస్ట్)
హైదరాబాద్: హుధూద్ తుఫాన్ బాధితులకు సహాయం అందించేందుకు తెలుగు సినీ పరిశ్రమ కదిలింది. ఒకరి తర్వాత ఒకరు...ఒకరిని చూసి మరొకరు...ఇలా టాప్ హీరో పవన్ కళ్యాణ్ నుండి మొదలు పెడితే నందు లాంటి చిన్న హీరోల వరకు తమకు తోచిన సహాయం అందించారు.
టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్....తన స్థాయికి తగిన విధంగా అందరికంటే ఎక్కువగా రూ. 50 లక్షల విరాళం అందించారు. ఆ తర్వాత స్థానంలో బాలయ్య ఉన్నారు. రూ. 30 లక్షల విరాళం మరియు 15 లక్షల విలువైన నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు బాలయ్య తెలిపారు.
లక్షకు పైగా విరాళాలు అందించిన సినీ తారలు
అల్లరి నరేష్ (5 లక్షలు), ప్రకాష్ రాజ్ (5 లక్షలు), బ్రహ్మానందం(3 లక్షలు), సందీప్ కిషన్(రూ. 2.5 లక్షలు), సంపూర్ణేష్ బాబు(1 లక్ష), గోపీచంద్ మలినేని(1 లక్ష), రాకుల్ ప్రీత్ సింగ్(1 లక్ష), నందు(1లక్ష), కోన వెంకట్ (1లక్ష).
ఇప్పటి వరకు రూ. 10 లక్షల పైన విరాళాలు అందించిన సినీ తారల వివరాలు స్లైడ్ షోలో...

పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రూ. 50 లక్షల విరాళం అందించారు. తుఫాన్ విలయాన్ని చూసి చలించిన పోయిన్ పవన్ కళ్యాణ్ ఈ రోజు తుఫాన్ ప్రభావ ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

రామానాయుడు కుటుంబం
ప్రముఖ తెలుగు నిర్మాత రామానాయుడు కుటుంబం తుఫాన్ బాధితుల కోసం రూ. 50 లక్షల విరాళం ప్రకటించింది.

బాలయ్య
రూ. 30 లక్షల విరాళం మరియు 15 లక్షల విలువైన నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు బాలయ్య తెలిపారు.

మహేష్ బాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రూ. 25 లక్షల విరాళం ప్రకటించారు.

నాగార్జున (అక్కినేని ఫౌండేషన్)
అక్కినేని ఫౌండేషన్ తరుపున నాగార్జున రూ. 20 లక్షల విరాళం ప్రకటించారు.

అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రూ. 20 లక్షల విరాళం ప్రకటించారు.

ఎన్టీఆర్
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ రూ. 20 లక్షల విరాళం ప్రకటించారు.

ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రూ. 20 లక్షల విరాళం ప్రకటించారు.

రామ్ చరణ్ తేజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ. 10 లక్షలు, రామకృష్ణ మిషన్ కోసం రూ. 5 లక్షల విరాళం ప్రకటించారు. దీంతో పాటు 5 వేళ వాటర్ బాటిళ్లు, 5 వేళ పులిహోర ప్యాకెట్లు, 5 వేల బిస్కెట్ ప్యాకెట్ల పంపిణీ చేయనున్నారు.

కృష్ణ
ప్రముఖ సీనియర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ రూ. 15 లక్షల విరాళం ప్రకటించారు.

రవితేజ
మాస్ మహరాజ రవితేజ రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు.

నితిన్
హీరో నితిన్ రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు.

రామ్
హీరో రామ్ రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు.

విజయ నిర్మల
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు.


Click it and Unblock the Notifications











