twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మళ్ళీ పుడతావా భైరవా? చిన్నారి మగధీర, రామ్‌చరణ్ అభిమాని మృతి

    రామ్ చరణ్ వీరాభిమాని అయిన పిల్ల వాడు పరుశురామ్ మెరుగైన వైద్యం అందించలేకపోవటంతో బుధవారం కన్నుమూశాడు.

    |

    కొన్నాళ్ళ కిందట రామ్ చరణ్ వీరాభి మాని అయిన ఒక పిల్ల వాడు చరణ్ హిట్ సినిమా మగధీర లో డైలాగ్ లని చెబుతూ వార్తలకెక్కాడు గుర్తుందా? ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా ఇటీవల పలు సామాజిక వెబ్ సైట్ లలో హాల్ చల్ చేసింది. దీంతో ఆ వీడియో ను రోజు ఇష్టంగా చూస్తానని, ఆ కుర్రాడిని చూడాలని తన స్నేహితులతో రామ్ చరణ్ చెప్పాడు.

    పరుశురామ్

    పరుశురామ్

    వెంటనే అతని స్నేహితులు ఆ మగదీరుడి జాడను కనిపెట్టారు. అతని పేరు పరుశురామ్ అని, స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లా ఐజా అని, అతని తల్లిదండ్రులు ఇద్దరు కూడా గొర్రెలకాపర్లని తెలిసింది. వీరి పేదరికంగా కారణంగా బడికి వెళ్ళలేని పరుశురామ్, సినిమాల్లో వచ్చే డైలాగ్స్ ను ఇట్టే గుర్తు పెట్టుకోగల ఏక సంతా గ్రాహి.

    Recommended Video

    Ram Charan Helping Hand To Dhanush | Filmibeat Telugu
    రామ్ చరణ్ కు దొరికాడు

    రామ్ చరణ్ కు దొరికాడు

    స్దానిక కుర్రాళ్ళు అతను డైలాగ్ చెప్తుండగా తీసిన వీడియో పేస్ బుక్ లో పోస్ట్ చేశారు. అది అలా అలా వెళ్ళి హీరో రామ్ చరణ్ కు చేరింది. పేదరికం తో పాటు, అనారోగ్యం తో బాధ పడుతున్న ఈ కుర్రాడు ఎట్టకేలకు రామ్ చరణ్ కు దొరికాడు. 15 మార్చి 2015న తన ఇంటికి బుడతన్ని పిలిపించుకుని అభినందించాడు.

    హీరో కావాలనుకుంటున్నా

    హీరో కావాలనుకుంటున్నా

    పరుశురాం చాలా వినోదాన్ని పంచాడు. తనకు తెలిసిన ప్రతీ సినిమా డైలాగులు చెప్పేయడం విశేషం. డైలాగులు చెప్పటం కాదు బాగా చదువుకుంటావా, నేనే చదివిస్తాను అంటూ అడిగాడు. అంతేకాదు బాగా చదివితే ఉద్యోగం ఇప్పిస్తానని మాట ఇచ్చాడు. పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నావని అడిగిన రాంచరణ్‌కు బుల్లి మగధీర హీరో కావాలనుకుంటున్నానంటూ టకీమని చెప్పాడు.

    మాటిచ్చాడు

    మాటిచ్చాడు

    దీంతో రాంచరణ్ అయితే బాగా చదువుకో.. పెద్దయ్యాక నేనే నిన్ను హీరోని చేస్తానంటూ మాటిచ్చాడు. ఆరెంజ్ చిత్రంలో తాను ధరించిన టీ షర్ట్‌ను పరుశురాంకు బహుమతిగా ఇచ్చాడుఆ పిల్లవాన్ని కలిసిన చరణ్ వాడి టాలెంట్ కి ముగ్దుడై ఆ బాలుని సమ్రక్షణ తాను తీసుకుంటానని చెప్పి అతన్ని స్కూల్లో చేర్పించటమే కాదు ఆ పిల్లవాడి చికిత్స కి కూదా తాను హెల్ప్ చేస్తున్నా అంటూ ఆ భాద్యత తన భుజాలకెత్తుకున్నాడు.

    కన్నుమూశాడు

    కన్నుమూశాడు

    కానీ ఆ బాలుడి విషయం లో విధి చిన్న చూపు చూసింది రామ్ చరణ్ సాయం కూడా అతని ప్రాణాలు కాపాడలేక పోయింది. కూలీ డబ్బులతో జీవనం సాగించే కుటుంబ సభ్యులు చిన్నారికి జబ్బు చేస్తే మెరుగైన వైద్యం అందించలేకపోవటంతో బుధవారం కన్నుమూశాడు.

    English summary
    Parasuram, a boy from Mahabubnagar district who is known as the fan of Ram Charan, died with Jaundice on Friday
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X