మహేష్ బాబు రేంజ్ లోనే సితార క్రేజ్... ఈ ఒక్క యాడ్ తోనే అరుదైన ఘనత
స్టార్ కిడ్స్ కి ఎక్కడలేని క్రేజ్ ఉంటుంది. వారి ఫోటోలు చూడటానికి ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అయితే, దాదాపు స్టార్ హీరోలు మాత్రం తమ పిల్లలను కెమేరా కంట పడకుండా జాగ్రత్తపడుతూ ఉంటారు. డైరెక్ట్ గా సినిమాల్లోనే వారిని చూపించాలని అనుకుంటూ ఉంటారు. అప్పుడే వారి లుక్ పట్ల ఉత్సాహం చూపించే అవకాశం ఉంటుందని భావిస్తూ ఉంటారు.
ఇక మన దక్షిణాదిన దాదాపు అందరూ హీరోల కొడుకులు మాత్రమే హీరోలు అయ్యారు. వారికి కూతుళ్లు ఉంటే వారు మాత్రం హీరోయిన్లుగా అడుగుపెట్టిన సందర్భాలు చాలా అరుదు. ఉత్తరాదిన ఆ బేధం చూపించరు. అందుకే వారి కూతుళ్లు హీరోయిన్లుగా రాణిస్తున్నారు. కానీ, దక్షిణాదిన కమల్ హాసన్, యాక్షన్ హీరో అర్జున్ లాంటివారు మాత్రమే తమ కూతుళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

అయితే, ఈ విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఆలోచన మాత్రం భిన్నంగా ఉంది. ఆయన తన కొడుకును ఇప్పటికే బాల నటుడిగా ఓ సినిమాలో పరిచయం చేశాడు. ఇక కూతురిని కూడా అదే బాటలో ప్రేక్షకులకు ఎక్కువగా చేరువ చేస్తున్నాడు. డైరెక్ట్ గా సితార సినిమాలు చేయనప్పటికీ, ఆమెకు ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో చాలా ఎక్కువ క్రేజ్ ఉంది. తండ్రితో కలిసి ఈవెంట్స్ కి రావడం, మహేష్ ని ఇంటర్యూలు చేయడం, తన డ్యాన్స్ వీడియోలు షేర్ చేయడం లాంటివి చేస్తూ, సితార తనకంటూ ఓ స్పెషల్ ముద్ర వేసుకుంటోంది. ఎక్కువగా ప్రజలకు చేరువయ్యేలా మహేష్, నమత్రలు ఆమెను ప్రోత్సహిస్తుండటం విశేషం.
ఇప్పుడు తాజాగా ఆమె మరో ఘనత కూడా సాధించింది. ప్రముఖ బంగారు నగల తయారీ సంస్థ పిఎంజె జివెల్స్ ప్రత్యేకంగా సితార కలెక్షన్ పేరుతో ఓ స్పెషల్ బ్రాండ్ ని సృష్టించడం గమనార్హం. చాలా మంది పాపులర్ హీరోయిన్లకు కూడా ఈ క్రెడిట్ దక్కలేదు. కాగా, ఆ బ్రాండ్ జ్యువెలరీ సితార ధరించిన ఫోటోలను, దానికి సంబంధించిన యాడ్ లను న్యూ యార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించడం విశేషం.
ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట సైతం వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు మహేష్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇంత చిన్న వయసులోనే సితార సంపాదించడం మొదలుపెట్టింది అని కొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం. మరి కూతురి కెరీర్ విషయంలో మహేష్ కి ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయో, అందుకే ఇప్పటి నుంచే చాలా జాగ్రత్తగా అడుగులు వేయిస్తున్నారు. మరి కొడుకు విషయంలో ఏం ఆలోచిస్తున్నారో..!


Click it and Unblock the Notifications











