twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ కొత్త లుక్ కోసం ఆగలేకపోతున్నాడట.. రాజమౌళి సినిమాకు మళ్ళీ!

    |

    జూనియర్ ఎన్టీఆర్ అభిమానులని ఆకట్టుకోవడానికి అని రకాల ప్రయోగాలు చేస్తున్నాడు. టెంపర్ చిత్రంలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించిన సంగతి తెలిసిందే. నాన్నకు ప్రేమతో చిత్రంలో గడ్డం లుక్, జైలవకుశ చిత్రంలో నెగిటివ్ రోల్ ఇలా ఎన్టీఆర్ అన్ని రకాల ప్రయోగాలతో అభిమానులని అలరిస్తున్నాడు. తాజాగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఈ చిత్రంలో సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. ప్రముఖ పిట్ నెస్ ట్రైనర్ స్టీవెన్స్ పర్యవేక్షణలో ఎన్టీఆర్ కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజగా ఈ కసరత్తులు పూర్తయినట్లు స్టీవెన్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. అంతేకాదు మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించి అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేశాడు.

    త్రివిక్రమ్ సినిమా కోసం

    త్రివిక్రమ్ సినిమా కోసం

    త్రివిక్రమ్ చిత్రం కోసం ఎన్టీఆర్ గత కొన్ని నెలలుగా ప్రముఖ ఫిట్ నెస్ ట్రైనర్ స్టీవెన్స్ ఆధ్వర్యంలో కొత్త కు కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎన్టీఆర్ లుక్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఎన్టీఆర్ బాగా సన్నబడి కనిపిస్తున్నాడు.

    సిక్స్ ప్యాక్ లుక్

    సిక్స్ ప్యాక్ లుక్

    త్రివిక్రమ్ చిత్రంలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపిస్తాడని వినికిడి. యాక్షన్ సన్నివేశంలో ఎన్టీఆర్ లుక్ రివీల్ అవుతుందట. ఎన్టీఆర్ ఇదివరకే టెంపర్ చిత్రంలో సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించాడు. తాజగా అభిమానుల్లో త్రివిక్రమ్ చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

    అతడే అలా అంటే

    అతడే అలా అంటే

    స్టీవెన్స్ సమక్షంలో ఎన్టీఆర్ ఫిట్ నెస్ ట్రైనింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని స్టీవెన్స్ స్యయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఎన్టీఆర్ డెడికేషన్ తో అనుకున్నది సాధించామని స్టీవెన్స్ అన్నారు.

    ఆగలేకపోతున్నా అంటూ మరో ట్విస్ట్

    ఎన్టీఆర్ కొత్త లుక్ రివీల్ అయ్యే క్షణం కోసం ఆగలేకపోతున్నానంటూ తెలిపిన స్టీవెన్స్ ఎన్టీఆర్ అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేసాడనే చెప్పొచ్చు. అంతేకాదు మరో ఆశ్చర్యకర విషయం కూడా వెల్లడించాడు. రాజమౌళి చిత్రం కోసం మరో మారు ట్రైనింగ్ ఉంటుందని, అప్పుడు కలుద్దాం అంటూ ట్విట్ చేసి ఆసక్తి పెంచేశాడు.

    ఆర్‌ఆర్‌ఆర్‌లో కూడా

    ఆర్‌ఆర్‌ఆర్‌లో కూడా

    రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ నటించబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, చరణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు పూర్తయ్యాక ఈ చిత్రం మొదలవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం కోసం యూ ఎస్ లో నిర్వహించిన వర్క్ షాప్ లో ఎన్టీఆర్, చరణ్ పాల్గొన్నారు. స్టీవెన్స్ ట్వీట్ ద్వారా చరణ్, ఎన్టీఆర్ రాజమౌళి చిత్రంలో సరికొత్తగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

    English summary
    NTR completes fitness training. Lloyd Stevens reveals interesting news about NTR
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X