#ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్ షాకింగ్ లుక్... స్టీవెన్స్‌ను రంగంలోకి దింపిన రాజమౌళి!
దర్శకుడు రాజమౌళి తాను తీసే సినిమాలో పాత్రల విషయంలో, లుక్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారో... ఎంత విభిన్నంగా ఉండేలా తపిస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్వరలో ఎన్టీఆర్-రామ్ చరణ్‌లతో మొదలుపెట్టబోయే #ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలోనూ జక్కన ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలను ఇప్పటి వరకు ఎన్నడూ చూడని ఒక డిఫరెంట్ లుక్‌లో ప్రజెంట్ చేయబోతున్నాడు. ఈ మేరకు వారి కోసం ప్రత్యేకంగా ఫిజికల్ ట్రైనర్లను కూడా రంగంలోకి దింపాడు. ఎన్టీఆర్ లుక్‌ను పూర్తిగా మార్చేందుకు ఇంటర్నేషనల్ ఫిజికల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్‌ను రంగంలోకి దింపాడు.
రామౌళిని కలిసిన స్టీవెన్స్
ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండాలనే విషయం చర్చించేందుకు దర్శకుడు రాజమౌళిని కలిశాను. ఈ సినిమాకు పని చేస్తున్నందుకు ఆనందంగా ఉంది అని లాయిడ్ స్టీవెన్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

షాకయ్యేలా తారక్ లుక్
ఆర్ఆర్ఆర్ మూవీలో తారక్ లుక్ అందరూ షాకయ్యేలా ఉంటుంది. ఇంతకు మించి ఇప్పుడే ఏం చెప్పలేం... అని ఎన్టీఆర్-కళ్యాణ్ పిఆర్ఓ మహేష్ కోనేరు వెల్లడించారు.

సెట్స్ మీదకు వెళ్లేదెప్పుడంటే?
#ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. సెట్స్ నిర్మాణం కూడా పూర్తయింది. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్‌కు రాజమౌళి తన పాత్రలకు సంబంధించిన వర్క్ షాప్ నిర్వహించారు. కీరవాణి బాణీలు రెడీ చేస్తుట్లు తెలుస్తోంది. నవంబర్ లేదా డిసెంబర్ నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు.

రూ. 300 కోట్ల బడ్జెట్
#ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, నటీనటుల వివరాలు వెల్లడించనున్నారు.


Click it and Unblock the Notifications











