»   » ‘లోఫర్’ మూవీ లాంచ్: నాగబాబు ఫ్యామిలీ సందడి (ఫోటోస్)

‘లోఫర్’ మూవీ లాంచ్: నాగబాబు ఫ్యామిలీ సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లోఫర్' మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రారంభోత్సవం బుధవారం పూరిగన్నాథ్ కార్యాలయంలో లాంచనంగా జరిగింది. హీరో వరుణ్ తేజ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, పూరి కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో సందడి చేసారు.

ముహూర్తపు సన్నివేశానికి పూరి జగన్నాథ్ భార్య లావణ్య, నాగ బాబు భార్య పద్మజ క్లాప్ కొట్టారు. వరుణ్ తేజ్ సరసన నటించబోయే హీరోయిన్ దిశా పతానితో పాటు నాగ బాబు కూతురు నిహారిక కూడా ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు.


తొలి షెడ్యూల్ హైదరాబాద్ లోనే రేపటి నుండి మూడు రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగుతుంది. సెకండ్ షెడ్యూల్ జులై 20 జోధాపూర్ లో మొదలు కానుంది. ఆగస్టు 20 వరకు అక్కడే షూటింగ్ జరుగనుంది.


ఈ చిత్రం మాస్ మసాలా ఎంటర్టెనర్‌గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ ను ఫుల్ ఎనర్జీతో చూపించబోతున్నాడు. ఫెమినా మిస్ ఇండియా 2013 రన్నరప్ దిషా పతాని ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడీగా నటిస్తోంది. ఈ చిత్రానికి సునిల్ కశ్యప్ సంగీతం అందించబోతున్నాడు. బ్రహ్మానందం, రేవతి, పోసాని కృష్ణ మురళి తదితరులు ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు. స్లైడ్ షోలో ఫోటోలు...


లోఫర్
  

లోఫర్

లోఫర్ మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పూరి, వరుణ్, దిశా పతాని, నాగ బాబు, బిఏ రాజు తదితరులు.


క్లాప్
  

క్లాప్

ముహూర్తపు సన్నివేశానికి పూరి జగన్నాథ్ భార్య లావణ్య, నాగ బాబు భార్య పద్మజ క్లాప్ కొట్టారు.


నిహారి
  

నిహారి

లోఫర్ మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న నాగబాబు కూతురు నిహారిక.


హీరో, హీరోయిన్
  

హీరో, హీరోయిన్

లోపర్ మూవీలో తనకు జోడీగా నటించబోయే దిశా పతానితో కలిసి వరుణ్ తేజ్.


ప్రారంభోత్సవం
  

ప్రారంభోత్సవం

లోఫ్ మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా అంతా కలిసి ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.


శుభశ్వేతా ఫిలింస్
  

శుభశ్వేతా ఫిలింస్

శ్రీ శుభ శ్వేతా ఫిలింస్ పతాకంపై లోఫర్ మూవీ తెరకెక్కుతోంది.


నాగబాబు
  

నాగబాబు

లోఫర్ మూవీ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో నాగబాబు.


నిహారిక
  

నిహారిక

లోఫర్ మూవీ పూజా కార్యక్రమంలో నాగ బాబు కూతురు నిహారిక.


వరుణ్ తేజ్
  

వరుణ్ తేజ్

లోఫర్ మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హీరో వరుణ్ తేజ్


Please Wait while comments are loading...