లోకల్ రౌడీలతో చిత్రం ప్రమోషన్.. అంతా షాక్
రవితేజ, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందిన సూపర్‌హిట్ ఫిల్మ్ 'విక్రమార్కుడు'కు రీమేక్‌గా ప్రభుదేవా 'రౌడీ రాథోర్' చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రచారానికి డిస్ట్రిబ్యూటర్స్ ఓ కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. యుటివి మోషన్ పిక్చర్స్, సంజయ్ లీలాభన్సాలీ ఫిల్మ్స్ కలసి ఓ అరుదైన పబ్లిసిటీ ప్లాన్ ని రూపొందించాయి. స్థానిక రౌడీలను ఈ చిత్ర ప్రచారానికి వినియోగించాలన్నదే ఆ ప్లాన్.
నిజజీవితంలో కరడుగట్టిన రౌడీలను ఎంచుకునేందుకు వారు దేశవ్యాప్తంగా పోటీలు నిర్వహించాలనుకుంటున్నారు. ఇది విన్న బాలీవుడ్ ఒక్క సారిగా షాక్ అయ్యింది. ఇక ఇలా ఎంపికైన రౌడీలు చిత్ర ప్రచారంలో పాల్గొంటారు. వారితో పాటు హీరో అక్షయ్ కుమార్, హీరోయిన్ సోనాక్షి కూడా పాల్గొంటారు. అహ్మదాబాద్, హైదరాబాద్, జైపూర్, లక్నో, ముంబయి, న్యూఢిల్లీలలో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తారు. అక్షయ్ కోసం రౌడీ గ్యాంగ్‌ను సిద్ధం చేయటం వారి లక్ష్యం. చిత్రప్రచారంలో వారు ఆయనకు సాయం చేస్తారు. ఈ చిత్రం జూన్ 1న విడుదలవుతోంది.
అలాగే ఈ చిత్రంలో జింతాకా..పాటకు గానూ సౌత్ సూపర్ స్టార్ హీరో తీసుకున్నారు. తమిళ అగ్ర హీరోల్లో ఒకరైన విజయ్. అక్షయ్‌కుమార్, సోనాక్షి సిన్హా జంటగా నటిస్తున్న 'రౌడీ రాథోర్'లో ఓ పాటలో అతను స్పెషల్ అప్పీరెన్స్‌గా నటించాడు. ముంబైలోని ఫిల్మ్‌సిటీలో చిత్రీకరించిన ఈ పాటలో రెండు రోజుల పాటు పాల్గొన్న విజయ్ ఉచితంగానే నటించారు. నిర్మాతలు రెమ్యునేషన్ చెల్లించడానికి సిద్ధమైనా విజయ్ దాన్ని సున్నితంగా తోసిపుచ్చి వార్తల్లో కెక్కాడు.
ఇక ఈ చిత్రం మొన్నీ మధ్య తమిళంలో కార్తీ హీరోగా చిరుతై క్రింద రీమేకైంది.ఇప్పుడు హిందీలో రీమేక్ అయ్యి విడుదలకు రెడీ అవుతోంది. ప్రభుదేవా దర్శకత్వంలో సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ చిత్రం మంచి బిజినెస్ జరిగిందని సమాచారం. పోకిరీ ని వాంటెడ్ మార్చి బాలీవుడ్ లో హిట్ కొట్టిన ప్రభుదేవాపై నమ్మకంతో ఈ ప్రాజెక్టుని అప్పచెప్పినట్లు చెప్తున్నారు. సోనాక్షి సిన్హా ఈ చిత్రంలో అనూష్క పాత్రను చేసింది. ఈ చిత్రం పక్కా మాస్ మశాలా గా రూపొందించటానికి ప్రభుదేవా చాలా రోజులు పాటు స్క్రిప్టు పై కసరత్తులు చేసి తెరకెక్కించారు. అక్షయ్ కుమార్ సైతం చాలా రోజుల తర్వాత తాను ఇలాంటి మాస్ హీరో పాత్ర చేయటంతో చాలా సంతోషంగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











