అదరగొట్టారంటూ ‘గూఢచారి’ టీంపై మంత్రి నారా లోకేష్ ప్రశంసలు!
అడవి శేష్, శోభిత ధూలిపాళ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'గూఢచారి' బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆగస్టు 3న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమా చూసిన ఏపీ మంత్రి నారా లోకేష్ సైతం స్పందించారు.
ఆదివారం సినిమా చూసిన అనంతరం లోకేష్ ట్వీట్ చేస్తూ..."స్పై ఫిల్మ్ గూఢచారి చిత్రం చూస్తున్నంత సేపు ప్రతి నిమిషం థ్రిల్ ఫీలయ్యాను. సినిమాను చాలా ఎంజాయ్ చేశాను. అడవి శేష్, శోభిత ధూళిపాళ, ప్రకాశ్ రాజ్, శశి కిరణ్ గ్రేట్ వర్క్' అంటూ ట్వీట్ చేశారు.
ఇటీవల జరిగిన సక్సెస్ మీట్‌లో హీరో అడవి శేష్ మాట్లాడుతూ...సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బావుందని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఇది నా ఫైవ్ ఇయర్స్ కృషి. వైజాగ్ లో చిన్నప్పుడు నేను త్రీ ఇయర్స్ వున్నాను. ఆ టైంలో జగదాంబ థియేటర్ లో అన్నీ సినిమాలు చూసేవాడ్ని. అలాంటిది ఇప్పుడు నా సినిమా అదే థియేటర్లో హౌస్ ఫుల్ అవడం బిగ్ అచీవమెంట్ గా భావిస్తున్నాను. శశి ఫెంటాస్టిక్ గా ఈ సినిమా తీసాడు. శ్రీ చరణ్ మ్యూజిక్, కెమెరా వర్క్ కి చాలా పేరు వచ్చింది. అబ్బూరి రవి నాకోసం పంజా చిత్రం లో మంచి క్యారెక్టర్, డైలాగ్స్ రాసారు. అలాగే క్షణం లో కూడా మంచి డైలాగ్స్ ఇచ్చారు. ఈ రెండు చిత్రాలు నా కెరీర్ ఎదుగుదలకి చాలా హెల్ప్ అయ్యాయి. ఇప్పుడు గూఢచారి కి ఎక్స్ లెంట్ డైలాగ్స్ రాసారు. ఈ మూడు చిత్రాలు నాకు చాలా మంచి పేరు తెచ్చాయి అన్నారు.

క్షణం' వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత అడివి శేష్ హీరోగా నటించిన చిత్రం 'గుడాచారి'. శోభిత ధూళిపాళ్ల హీరోయిన్ గా అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీం మర్చెంట్స్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అభిషేక్ నామ, టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా గూడాచారి చిత్రాన్ని నిర్మించారు.


Click it and Unblock the Notifications











