దాసరి నారాయణరావు తీసిన రాజకీయ వ్యంగ్య చిత్రం మేస్త్రి పలుచోట్ల నిరశనలు ఎదుర్కొంటూంటే లోక్ సత్తా అధినేత జె.పి మాత్రం ప్రశంసలు వర్షం కురిపించారు. మేస్త్రి చిత్రం తాను చూసానని, సరైన టైమ్ కి వచ్చిన సరైన చిత్రమని ఆయన ప్రశంసలు వర్షం కురిపించారు. ఓ ఛానెల్ తో మాట్లాడుతూ...చిత్రంలో చివరి పాట ఓటు విలువను చెప్పుతూ వచ్చిందని అది చాలా బాగుందని, రాష్ట్రమంతా దాన్ని చూపాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఆ పాటని దాసరి ఫర్మిషన్ ఇస్తే తాము ఆ పాటని తమ పార్టీ ప్రచారంగా వాడుకుని అందరూ ఓటు వేయలనే సందేశాన్ని విస్తారంగా ప్రచారం చేస్తామని చెప్పుకొచ్చారు. ఇక ఇదేవిషమై తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ మేస్త్రి చిత్రంలో అన్ని అందరిపై సెటైర్స్ ఉన్నాయని ప్రత్యేకంగా ఒక పార్టీనే ఉద్దేశించి అన్నట్లు చూడవద్దని అన్నారు. అలాగే దాసరి ప్రతీ చిత్రంలోనూ ఇలాంటి సమాజిక అంశాలుకు ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్త తీసుకుని చేస్తారని అన్నారు.