ద్యావుడా..! క్రియేటివిటీ పీక్స్: యాడ్ స్పూఫ్ తో, నవ్వలేక పొట్టచేత్తో పట్టుకుంటారంతే

సినిమా ఎంత బాగా తీసామన్నది కాదు ఎంతబాగా ప్రమోట్ చేసామన్నది అంతకంటే ఇంపార్టెంట్., నిజానికి సినిమా తీయటం ఒక ఎత్తయితే దాన్ని సరైన విధంగా పబ్లిసిటీ చేసుకోవటం అంతకంటే పెద్ద టాస్క్. సరైన విధంగా పబ్లిసిటీ లేక థియేటర్ దగ్గర కళ్ళు తేక్లేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అయితే ప్రమోషన్ అన్నది ఎప్పుడూ ఒక పోస్టర్, టీజర్, ట్రైలర్ ఇలా ఆగిపోతే ఎలా? అందుకే కొత్త పద్దతిలో ట్రై చేసారు "లండన్ బాబులు".

 నవ్వి నవ్వీ పొట్ట చేత్తో పట్టుకుంటారు

నవ్వి నవ్వీ పొట్ట చేత్తో పట్టుకుంటారు

ఇంతకు ముందులాగా రోజుల తరబడి సినిమా థియేటర్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి వారం తిరిగేలోపు కలెక్షన్లు రాబట్టుకోవాలి, మొదటి మూడు రోజుల్లోనే పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేయాలి. అలాటి సమయం లో లండన్ బాబులు టీమ్ ప్రయోగం పిచ్చి పిచ్చిగా నవ్విస్తోంది... కొంచం హ్యూమర్, ఇంకొంచం క్రియేటివిటీ కలుపుకొని చేసిన ఈ యాడ్ చూడండి.. నవ్వి నవ్వీ పొట్ట చేత్తో పట్టుకుంటారు...

బ్రాండ్ అంబాసిడర్‌గా

బ్రాండ్ అంబాసిడర్‌గా

ఈ మధ్య టీవీ చానెల్స్‌లో అదరగొడుతున్న లలితా జ్యూయలర్స్ యాడ్ ఎంత సంచలనం అయిందో తెలిసిందే. ఆ యాడ్‌‌లో ఏకంగా లలిత జ్యూయలర్స్ యాజమాని అయిన కిరణ్ వచ్చి మార్కెట్‌లో అంటూ.. బంగారం విలువ గురించి లలిత జ్యూయలర్స్ గురించి చెప్తూ బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు.

లండన్ బాబులు టీమ్ ప్రమోషన్‌

లండన్ బాబులు టీమ్ ప్రమోషన్‌

ఆయన చేస్తున్న ప్రమోషన్ హాట్ టాపిక్ అవ్వడమే కాకుండా లలిత జ్యూయలర్స్ సేల్స్ పెరగడానికి కూడా కారణం అవుతోంది. ఇప్పడిదే స్ఫూఫ్‌తో లండన్ బాబులు టీమ్ ప్రమోషన్‌కి దిగింది. ఈ స్ఫూఫ్ వీడియోలు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇక వీడియోలో ఉన్న మ్యాటర్ విషయానికి వస్తే..

కన్ఫ్యూజ్ అవుతున్నారా?

కన్ఫ్యూజ్ అవుతున్నారా?

"ప్రతి శుక్రవారం ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమా కెళదామా? ఈ సినిమా కెళదామా? అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? మీ దగ్గర ఉన్న మొబైల్‌లో మా లండన్ బాబులు ట్రైలర్ చూడండి. మా ట్రైలర్ పెట్టుకుని మిగతా నాలుగైదు సినిమాల ట్రైలర్స్‌తో కంపేర్ చేయండి.

 డబ్బులు అంత ఈజీగా రావు

డబ్బులు అంత ఈజీగా రావు

నచ్చితే మీ దగ్గరలో ఉన్న థియేటర్‌కి వెళ్లి మా లండన్ బాబులు మూవీ చూడండి. డబ్బులు అంత ఈజీగా రావు. మంచి సినిమా. మా లండన్ బాబులు చూడండి. డబ్బు ఎంతో విలువైంది. కానీ సమయం అంతకంటే విలువైంది. ఇంత వరకు మీరు ఎంతో ఖర్చుపెట్టి ఎన్నో సినిమాలు చూసుంటారు.

నవంబర్ 17న

ఇక ఖర్చుపెట్టింది చాలు. నవంబర్ 17న మా లండన్ బాబులు మూవీని థియేటర్‌కి ఒక్కసారి వచ్చి చూడండి. మీరు పెట్టే ప్రతి పైసాకి రెట్టింపు ఆనందం ఇచ్చే హామీ మాది. నవంబర్ 17న లండన్ బాబులు రిలీజ్...'' అంటూ విలన్ పాత్రలు చేసే అజయ్ ఘోష్‌, లలిత జ్యూయలర్స్ కిరణ్‌ని ఇమిటేట్ చేస్తున్న వీడియోలు ఇప్పడు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ వీడియోలతో అటు కామెడీని, ఇటు సినిమా ప్రమోషన్‌ని చేస్తున్నారు చిత్రయూనిట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X