పవన్ ఆమెకి పిచ్చ పిచ్చగా నచ్చేస్తున్నాడు

అలాగే పవన్ ఏటిట్యూడ్ నాకు పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంటుంది. అసలు ఆయన బిహేవియర్ లో ఏదో మ్యాజిక్ ఉంది ...అంది. ఇదంతా మొన్న హిమాయిత్ నగర్ లో షూటింగ్ జరుగుతూంటే వెళ్ళిన వారితో ముచ్చటిస్తూ చెప్పింది. అదే సమయంలో పవన్ ఓ ప్రక్క షాట్స్ కి అటెండవతూ...ప్రజా రాజ్యం తరుఫున తనతో మాట్లాడటానికి వచ్చిన వారిని పలకరిస్తూ...కొంతమందికి ఆటోగ్రాఫ్ లు, ఫొటోలు కలపి తీయించుకోవటానికి అవకాశమిస్తూ బిజీగా కనపడ్డారు.
ఇక ఈ సినిమా జనవరి 2009 కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే సంగీతం ఎ.ఆర్ .రహమాన్ కావటంతో మరింత లేటయ్యే అవకాశముందనీ వినపడుతోంది. అలాగే ఈ సినిమాలో పవన్ పోలీస్ పాత్రలో కనిపిస్తారు. అలాగే తొలిసారిగా ద్విపాత్రల్లో నటిస్తున్నారు. ఖుషి ఫేమ్ ఎస్.జె.సూర్య ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











