సీక్రెట్ గా...అల్లరి నరేష్ కి లండన్ మేకప్
హైదరాబాద్ : ప్రస్తుతం అల్లరి నరేష్ నటిస్తున్న చిత్రం 'లడ్డూబాబు'. రవిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. త్రిపురనేని రాజేంద్ర నిర్మాత. ఈ సినిమాలో నరేష్ కోసం ప్రత్యేకమైన మేకప్ విధానాలను అనుసరిస్తున్నారు. ఈ చిత్రంలో నరేష్ పాత్ర కొత్త తరహాలో వినోదాన్ని పంచేలా ఉంటుందని సమాచారం. ఇందుకు సంబంధించిన మేకప్ కోసం లండన్‌లోని నిపుణులను సంప్రదించారు.
వారి సూచనలకు అనుగుణంగా నరేష్‌కి మేకప్ చేస్తున్నారు. ఇందుకోసం సుమారు మూడు గంటలపాటు మేకప్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన చిత్రీకరణ విషయంలో హీరో, దర్శకనిర్మాతలు పలు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. సెట్‌కి యూనిట్ మినహా మరెవరూ రాకుండా చూసుకొంటున్నారు.

ఇక అల్లరి నరేష్ నట జీవితం మొదలై పదకొండేళ్లయింది. ఇప్పుడాయన హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నారు. విడుదలకు సిద్ధమవుతున్న 'కెవ్వు కేక' సినిమా నరేష్‌కి 45వ చిత్రం. 'లడ్డూబాబు' 46వది. ఇ.సత్తిబాబు, శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వం వహించే చిత్రాలు, కానుమిల్లి అమ్మిరాజు నిర్మించే చిత్రాలు నరేష్ చేస్తారు. 50వ సినిమాను ఇ.వి.వి.సినిమా పతాకంపై ఆర్యన్ రాజేష్ నిర్మిస్తారు. వీటికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడవుతాయి. ఆదివారం నరేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ధట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

Click it and Unblock the Notifications